వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా కాల్పులు: మృతుల్లో నలుగురు సిక్కులు.. సంతాపంగా వైట్ హౌస్‌పై జాతీయ జెండా అవనతం...

|
Google Oneindia TeluguNews

అమెరికాలోని ఇండియానా పోలిస్‌లో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు సిక్కు వ్యక్తులు ఉన్నట్లు ఆ కమ్యూనిటీ వెల్లడించింది. కాల్పులకు పాల్పడిన నిందితుడు 19 ఏళ్ల బ్రాండన్ స్కాట్ హోల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇండియానా పోలిస్ విమానాశ్రయం సమీపంలోని ఫెడెక్స్ కార్గో డెలివ‌రీ సంస్థ కార్యాలయం వద్ద ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో పనిచేస్తున్నవారిలో 90శాతం భారత సంతతి అమెరికన్లే కావడం గమనార్హం. అందులోనూ ఎక్కువమంది సిక్కు కమ్యూనిటీకి చెందినవారే ఉన్నారు.

మృతుల వివరాలు..

మృతుల వివరాలు..

'ఇది అత్యంత హృదయవిదారక సంఘటన.ఈ ఘటనతో సిక్కు కమ్యూనిటీ దిగ్భ్రాంతికి గురైంది.' అని ఇండియానా పోలిస్‌లోని సిక్కు కమ్యూనిటీ నేత గురీందర్ సింగ్ ఖల్సా తెలిపారు. కాల్పుల ఘటన తర్వాత ఫెడెక్స్ కార్గో డెలివరీ కార్యాలయానికి వెళ్లిన ఆయన... అక్కడ పనిచేస్తున్నవారితో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.మరో సిక్కు కమ్యూనిటీ యాక్టివిస్ట్ మనీందర్ సింగ్ వాలియా కాల్పుల్లో మృతి చెందిన సిక్కు వ్యక్తుల పేర్లు వెల్లడించారు. మృతులను అమర్జత్ కౌర్ శేఖోన్(మహిళ-48),జస్వీందర్ కౌర్(మహిళ),అమర్జిత్ కౌల్ జోహాల్(మహిళ),జస్వీందర్ సింగ్(పురుషుడు)గా గుర్తించినట్లు తెలిపారు. కాల్పుల ఘటనలో హర్‌ప్రీత్ సింగ్ గిల్(45) గాయపడినట్లు చెప్పారు. ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో అతను చికిత్స పొందుతున్నారు.

అధ్యక్షుడు జో బైడెన్ విచారం...

అధ్యక్షుడు జో బైడెన్ విచారం...

కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న జపాన్ ప్రధాని యోషిషిండే సుగా కూడా కాల్పుల ఘటనపై స్పందించారు. అమాయక పౌరుల పట్ల ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగకూడదన్నారు. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో స్వేచ్చ,ప్రజాస్వామ్యం,మానవ హక్కులు,రూల్ ఆఫ్ లా,ప్రపంచ శ్రేణి విలువలు ప్రబలంగా ఉండాలన్నారు.

సంతాపంగా జెండా అవనతం..

సంతాపంగా జెండా అవనతం..

కాల్పుల ఘటనలో చనిపోయినవారికి సంతాపంగా వైట్ హౌస్ సహా అమెరికాలోని అన్ని ఫెడరల్ బిల్డింగ్స్‌పై జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. ఇండియానా పోలిస్‌లో దాదాపు 10వేల మంది సిక్కులు నివసిస్తున్నారు. తాజాగా ఘటన నేపథ్యంలో భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అగస్టు 5,2012లో విస్కాన్సిన్‌లోనూ ఆరుగురు సిక్కులు హత్యకు గురయ్యారని గుర్తుచేస్తున్నారు.

English summary
At least eight people, including four Sikhs, were killed and five others were left injured in a mass shooting at a FedEx facility in the US state of Indiana, according to community leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X