ఖాట్మండులో మళ్లీ వర్షం, సహాయక చర్యలకు ఇబ్బంది: మృతులు 10 వేలకు పైనే..
ఖాట్మండు: పెను భూకంపంతో అతలాకుతలమైన ఖాట్మండును మళ్లీ వర్షం తాకింది. దాని వల్ల సహాయ చర్యలకు విఘాతం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. శనివారంనాడు పెను భూకంపం తాకినప్పటి నుంచి గత మూడు రాత్రులు ప్రజలు ఆరు బయటే కునుకు తీసారు.
మంగళవారంనాడు ఖాట్మండులో వర్షం కురిసింది. దాంతో భూకంప బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. దాదాపు 15, 20 నిమిషాల పాటు వర్షం కురిసింది. సహాయక చర్యలకు కూడా దానివల్ల విఘాతం కలిగింది. భూకంపం వచ్చినప్పటి నుంచి ప్రజలు తమ ఇళ్లకు వెళ్లడం కూడా మానేశారు.

భూకంపం వల్ల మరణించినవారి సంఖ్య 10 వేలకు చేరవచ్చునని నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాల అన్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు తెలిపారు. యుద్ధప్రాతిపదికపై సహాయ పునరావాస చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఇది అత్యంత కష్టమైన, సవాల్‌తో కూడిన సందర్భమని ఆయన అన్నారు.
కాగా, భయాందోళనలకు గురి కావద్దని భారత్ నేపాల్‌లోని తన పౌరులకు సూచించింది. నేపాల్‌లో భారీ సంఖ్యలో భారతీయులు ఉన్నారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛగా సంచరించడానికి అవసరమైన వెసులుబాట్లు కల్పించారు. వీసా గానీ మరేమీ గానీ అవసరం లేదు.












Click it and Unblock the Notifications