ఊహించని షాక్ ఇచ్చిన ట్రంప్.. అన్నీ వదిలేసి సొంత ఊరిలో వ్యవసాయం..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల్ని వణికిస్తున్నారు. కనిపించిన దేశంపై సుంకాలు,పన్నులు వేసి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అటు వలసవాదులను ఇటు విదేశీ విద్యార్థులను అమెరికా పొరిమేరలో అడుగుపెట్టకుండా చేస్తున్నారు. చైనా, రష్యాలతో క్షణం తీరిక లేకుండా పోరాడుతున్నారు. ఈ బిజీ లైఫ్ లో ట్రంప్ మామ.. తన ఊరిని మర్చిపోయినట్టు ఉన్నారు. అందుకే అగ్రరాజ్యం సింహాసనానికి హాలీడేస్ ప్రకటించి ఎంచక్కా సొంత ఊరు వెళ్లిపోయి వ్యవసాయం చేస్తున్నారు. ఆయన వ్యవసాయం చేస్తున్న వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇదీ అసలు విషయం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో ఓ రైతులా జీవిస్తే ఎలా ఉంటుందో అన్న ఏఐ వీడియో ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. ఏఐ సాంకేతికతతో ఈ వీడియోను రూపొందించారు. ఈ ఏఐ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందరి రైతుల్లాగే పశువుల కోసం సైకిల్ పై పచ్చిగడ్డి తీసుకెళ్లడం, ఊర్లో చెట్టుకింద అంతా కలిసి ముచ్చటించడం, మనవళ్లు, మనవరాళ్లతో సందడిగా గడపడాన్ని ఈ వీడియోలో చూపించారు. మలయాళీలు ఇష్టంగా జరుపుకునే విషు పర్వదినం వేళ ఈ వీడియోను ఓ నెటిజన్ షేర్ చేశారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది.

ఇక తాజాగా భారత్ పై 26 శాతం మేర టారిఫ్ విధించారు ట్రంప్. దీంతో భారత్ నుంచి అమెరికాలో దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపైనా ఈ పన్ను వర్తిస్తుంది. అంటే ఇప్పటివరకు ఉన్న టారిఫ్‌కు మరో 26 శాతం మేర అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మేక్ అమెరికా వెల్తీ ఎగైన్ అనే కాన్సెప్ట్‌లో భాగంగా టారిఫ్‌ను విధించినట్లు అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక అటు చైనా పైన ఇప్పటికే 145 శాతం టారిఫ్ విధించారు ట్రంప్. అమెరికా రావాలనుకుంటున్న విదేశీయులకు కఠిన నియమాలు తీసుకొచ్చారు. దీంతో ట్రంప్ ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటారోనని ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి.












Click it and Unblock the Notifications