వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెడ్డా కెన్నడీలు: సౌదీ అరేబియాలో బిన్ లాడెన్ ఫ్యామిలీ ఎలా ఉండేదంటే?

|
Google Oneindia TeluguNews

జెడ్డా: బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులతో గడగడలాడించిన అల్ ఖైదా ఒసామా బిన్ లాడెన్ ఎంతోమంది అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు. అయితే లాడెన్ కుటుంబంను జెడ్డా కెన్నడీలుగా పిలుస్తారు. సౌదీ అరేబియా రాజుకు లాడెన్ తండ్రి సన్నిహితులు. లాడెన్ కుటుంబం సౌదీలో రోడ్లు, మసీదులు, ప్యాలెస్‌లు నిర్మించింది.

లాడెన్‌ తండ్రి 1920ల్లో యెమన్‌ నుంచి సౌదీ అరేబియా వెళ్లాడు. 1931లో ఓ చిన్న కన్‌స్ట్రక్షన్ కంపెనీని ప్రారంభించారు. అప్పటి సౌదీ రాజు అబ్దులాజిజ్‌ లాడెన్‌ తండ్రికి ఎన్నో కాంట్రాక్టులు ఇచ్చారు. ఆయన కోసం మొహమ్మద్‌ కేవలం ఇరవై రోజుల్లోనే ఓ ప్యాలెస్‌ను నిర్మించారని అంటారు. సౌదీ రాజుకు సంబంధించిన అన్ని నిర్మాణ కాంట్రాక్టులు ఎక్కువగా లాడెన్‌ కుటుంబానికే వచ్చాయి.

From rags to riches, How Bin Laden family became the Kennedys of Jeddah

లాడెన్‌ తండ్రి కుటుంబం చాలా పెద్దది. 70 మంది పిల్లలు, డజన్ల మంది భార్యలు ఉండేవారు. లాడెన్ తండ్రి మరణానంతరం కూడా ఆయన పిల్లలు, మనవళ్లు సౌదీ రాజుతో కలిసి పని చేశారు. బిన్ లాడెన్‌ గ్రూప్‌కు కొన్ని కోట్ల విలువ చేసే ప్రాజెక్టుల కాంట్రాక్టులు వచ్చేవి. జెడ్డాలో విమానాశ్రయ నిర్మాణానికి పని చేశారు.

లాడెన్‌ సోదరులు బక్ర్‌, సలాహ్‌, సాద్‌లు కూడా సౌదీ రాజ వంశీయులకు ఎంతో నమ్మకస్తులు. అత్యంత తక్కువ సమయంలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు సౌదీ బిన్‌లాడెన్‌ గ్రూప్‌ రష్‌ ప్రాజెక్ట్‌ పేరుమీద ఓ డివిజన్‌ను ఏర్పాటు చేసింది. ఇది ప్రభుత్వం కోసమే పని చేసేది. జెడ్డాలో సౌదీ కింగ్‌ అబ్దుల్లా కోసం ప్రత్యేకంగా సరికొత్త ప్యాలెస్‌ను నిర్మించారు. గత ఏడాది వరకు బాగానే ఉన్న కంపెనీ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. 2001 సెప్టెంబర్ 11 దాడుల అనంతరం వీళ్ల ఫ్యామిలీ కన్‌స్ట్రక్షన్ బిజినెస్ స్క్రూటినీ కిందకు వచ్చింది.

English summary
In Saudi Arabia, the Bin Ladens are known as the Kennedys of Jeddah for their wealth and tragedies. They built Saudi Arabia's roads, mosques and palaces. Family patriarch Mohammed died in a plane crash, as did the son who succeeded him. Younger son Osama plotted the 9/11 attacks on the United States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X