గాంధీ ‘ట్రస్టీషిఫ్’ గ్రేట్: బైడెన్‌తో మోడీ, అమెరికా ప్రగతిలో భారతీయుల పాత్ర
వైట్ హౌస్ ఓవల్ ఆఫీసులో జో బైడెన్, మోడీ డిస్కషన్స్ కంటిన్యూ అవుతోంది. వాతావరణ మార్పులు, కరోనా నివారణ కోసం బైడెన్ తీసుకున్న చర్యలను మోడీ అభినందించారు. ఇదే అంశాన్ని క్వాడ్ సమావేశంలో కూడా చర్చిస్తామని మోడీ పేర్కొన్నారు. భారత్ అమెరికా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని జో బైడెన్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నివారణ.. ప్రజా భద్రత ముఖ్యం అని అభిప్రాయపడ్డారు.
అమెరికా ప్రపంచాన్ని శాసిస్తోందని మోడీ అన్నారు. అగ్రరాజ్య అధినేతగా కీలకపాత్ర పోషిస్తున్నారని బైడెన్‌ను మోడీ ప్రశంసించారు. ఈ క్రమంలో అమెరికాతో భారత్ మరింత సన్నిహితంగా మెలగనుందని వివరించారు. గాంధీ జయంతి గురించి బైడెన్ మాట్లాడారు. గాంధీజీ అంటే ధర్మకర్తవ్యం అని.. ఇదీ ప్రపంచంలో కీలక భూమిక పోషిస్తోందని మోడీ తెలియజేశారు. వచ్చే దశాబ్దంలో భారత్- అమెరికా మధ్య వర్తక- వాణిజ్య సంబంధాలు మరింత మెరగుపడుతాయని మోడీ అభిప్రాయపడ్డారు. ప్రతిభ ఆధారంగా దేశ ఉన్నతి ఆధారపడిందని.. అమెరికా ప్రగతిలో భారతీయులు కూడా తమ వంతు సాయం చేస్తున్నారని మోడీ పేర్కొన్నారు. టెక్నాలజీ అనేది ముఖ్యమైన అంశంగా మారిపోయిందని వివరింాచరు. ప్రతిభను ఉపయోగించి.. మంచి టెక్నాలజీ అందించాలని అభిప్రాయపడ్డారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు రోజుల అమెరికా పర్యటనకు బుధవారం బయల్దేరి వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాతోపాటు జపాన్, ఆ్రస్టేలియాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుంది. కోవిడ్ సంక్షోభం, ఉగ్రవాదం నిర్మూలన, వాతావరణం మార్పులు, ఇతర అంశాలపై యూఎన్ సదస్సులో దృష్టి పెడతామని అంతకుముందు మీడియాతో ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.
ఈ నెల 25వ తేదీ వరకు మోడీ అమెరికా పర్యటన కొనసాగనుంది. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర అత్యున్నత స్థాయి బృందం ప్రధాని వెంట వెళ్లారు. ప్రధాని మోడీ రెండోసారి పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2014 నుంచి ఇప్పటివరకు ఆయన రెండుసార్లు అమెరికా పర్యటన చేపట్టారు.












Click it and Unblock the Notifications