• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికా 41వ అధ్యక్షుడు జార్జ్ బుష్ సీనియర్ కన్నుమూత

|

అగ్రరాజ్యం అమెరికాకు 41 అధ్యక్షుడిగా సేవలందించిన జార్జ్ హర్బర్ట్ వాకర్ బుష్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన వయస్సు 94 ఏళ్లు. 1989 నుంచి 1993 వరకు జార్జ్ బుష్ సీనియర్ అమెరికా అధ్యక్షుడిగా సేవలందించారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన సమయంను ప్రత్యక్ష్యంగా వీక్షించిన నాటి అధినేతల్లో ఒక దేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన వారిలో చివరి వ్యక్తి జార్జ్ బుష్ సీనియర్.ఈయన అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్‌కు తండ్రి. స్థానిక కాలమాన ప్రకారం శుక్రవారం రాత్రి 10గంటల 10 నిమిషాలకు జార్జ్ బుష్ సీనియర్ తుది శ్వాస విడిచినట్లు ఆయన ప్రతినిధి జిమ్ మెక్‌గ్రాత్ తెలిపారు. జార్జ్ బుష్ సీనియర్ భార్య బార్బరా మృతి చెందిన 8 నెలలకే ఆ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. బార్బరా ఏప్రిల్ 17న తుదిశ్వాస విడిచారు. ఇద్దరు టీనేజర్లుగా ఉన్నప్పుడు పరిచయం ఏర్పడి ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. వీరి వివాహ బంధం 73 ఏళ్లు కొనసాగింది.

George H.W. Bush, 41st president of the United States, dies at 94

బార్బారా చనిపోయిన సమయంలో ఆమె మృతదేహం పక్కనే వీల్ ఛైర్‌లో కూర్చుని జార్జ్ బుష్ సీనియర్ కన్నీరు మున్నీరు అవడం ఆనాడు పలువురిని కలచివేసింది. బార్బరా మృతితో బుష్ డీలా పడ్డారు. క్రమంగా అనారోగ్య పాలయ్యారు. ఆమె మరణం తర్వాత అంత్యక్రియలు జరిగిన 24 గంటల్లోపే బుష్‌ను ఆస్పత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది. అతన్ని ఇంటెన్సివ్‌ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందించారు వైద్యులు.క్రమంగా కోలుకున్న బుష్ తిరిగి తన కుటుంబ సభ్యలతో గడిపేందుకు తనకు ఇష్టమైన ప్రాంతం కెన్నెబంక్ పోర్టుకు ఈ ఏడాది మేలో వెళ్లారు. అయితే ఒక వారానికే ఆరోగ్య సమస్య తలెత్తడంతో తిరిగి ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. జార్జ్ బుష్‌కు ఐదుగురు పిల్లలున్నారు. 14 మంది మనవళ్లు మనవరాండ్లు ముని మనవళ్లు ముని మనవరాళ్లు ఉన్నారు.

జార్జ్ బుష్ అమెరికా అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారు. ఇప్పటికీ మూడు దశాబ్దాల క్రితం బుష్ ప్రవేశ పెట్టిన సంస్కరణలనే అమెరికా పాటిస్తోందంటే ఆయన పాలన ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడ అయినప్పటికీ ఆ గర్వం కించిత్‌ అయినా జార్జ్ బుష్ ముఖంలో కనిపించేది కాదని పలువురు ప్రముఖులు ఇప్పటికీ కొనియాడుతారు. తను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మంచి పాలనా పరమైన విధానాలు ప్రవేశపెట్టి జనాధరణ పొందినప్పటికీ... కుదేలైన ఆర్థిక వ్యవస్థతో మళ్లీ ఆయన రెండోసారి అంటే 1992 తిరిగి అమెరికా అధ్యక్షుడు కాలేకపోయారు. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఓటమి చూశారు. నాటి పరిస్థితులు బుష్‌కు అనుకూలించకపోవడంతో ఓటరు అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారని అందుకే ఓటమి పాలయ్యారని ప్రముఖ చరిత్రకారుడు రాబర్ట్ డల్లేక్ తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
George H.W. Bush, the 41st president of the United States and the father of the 43rd, was a steadfast force on the international stage for decades, from his stint as an envoy to Beijing to his eight years as vice president and his one term as commander in chief from 1989 to 1993.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more