వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్జియాలో చుక్కెదురు: లెక్కింపు ఆపాలనే దావా తిరస్కరణ.. మరో 50 వేల ఓట్లు

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. అయితే కౌంటింగ్ నిలిపివేయాలని దావాలు దాఖలవుతూనే ఉన్నాయి. రిపబ్లికన్ పార్టీ, ట్రంప్, అభ్యర్థులు పిటిషన్ వేస్తూనే ఉన్నారు. అయితే జార్జియ కోర్టు ఓట్ల లెక్కింపు ఆపివేయాలనే పిటిషన్‌ను కొట్టివేసింది. లెక్కింపు ప్రక్రియను చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో రిపబ్లికన్ అభ్యర్థికి చుక్కెదురైంది.

 Georgia Court Dismisses Republican Lawsuit on Ballots

జార్జియాలో బ్యాలెట్ ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని రిపబ్లికన్ పార్టీకి చెందిన శరవణ్ పిటిషన్ దాఖలు చేశారు. బ్యాలెట్ లెక్కింపులో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపణలు చేశారు. బ్యాలెట్లను పట్టికలో షెడ్యూల్ చేయని బ్యాలెట్లతో కలిపారని, ఇదంతా పరిశీలకుడి నేతృత్వంలో జరుగుతోందని ఆరోపించారు. దీనిని జడ్జీ జేమ్స్ ఎఫ్ బాస్ తిరస్కరించారు. ఇదీ సరికాదు అని మౌఖికంగానే తీర్పునిచ్చారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగించాలని స్పష్టంచేశారు.

మరోవైపు జార్జియాలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతోంది. మరో 50 వేల పోస్టల్ బ్యాలెట్ లెక్కించాల్సి ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పెద్ద కౌంటీ అట్లాంటాకు నిలయమైన పుల్టన్ కౌంటీ బ్యాలెట్ సేకరణ పూర్తిచేశామని అధికారులు తెలిపారు.

English summary
Georgia court dismissed a lawsuit filed in Savannah by Georgia Republicans to prevent the "illegal counting of ballots obtained after the election."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X