కొడుకుతో విడాకులకు యత్నం, కోడల్నికాల్చేసిన అత్త
జార్జియా: అమెరికాలోని జార్జియాలో ఓ అత్త తన కోడలిని తుపాకీతో దారుణంగా కాల్చి చంపింది. 63 ఏళ్ల ఎలిజబెత్ వాల్... తల్లిదండ్రుల వద్ద ఉంటున్న తన కోడలి వద్దకు వెళ్లింది. ఇద్దరు మనవళ్లను ఇంటి నుంచి బయటకు తీసుకు వచ్చి ట్రక్‌లో కూర్చో బెట్టింది.
తిరిగి ఇంట్లోకి వెళ్లి కోడలు జెన్నాను తుపాకీతో కాల్చి చంపింది. వెంటనే ఆఫీసులో ఉన్న కొడుకుకు ఫోన్ చేసింది. వచ్చి పిల్లలను తీసుకు వెళ్లమని సూచించింది. హుటాహుటిన కొడుకు ఇంటికి వచ్చాడు. రక్తపు మడుగులో ఉన్న భార్యను, చేతిలో తుపాకీతో ఉన్న తల్లిని చూశాడు.

ఆమెతో మాట్లాడిన అనంతరం పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయం తెలిసిందే. కొడుకుతో విడాకుల కోసం ప్రయత్నిస్తున్నందునే కోడలును హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
కోడలిని చంపడంతో పాటు, పిల్లల ఎదుటే హింసకు పాల్పడినందుకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎలిజబెత్ వాల్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు ఓ ఎలిమెంటరీ స్కూల్లో పని చేస్తోందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications