వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సవాల్‌, వైరస్‌పై జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మోర్కెల్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. వైరస్ జడలు విప్పి నాట్యం చేస్తోండటంతో నలుగురు కలిసి మాట్లాడే పరిస్థితి లేదు. వైరస్‌తో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. వైరస్‌కు మందు లేకపోవడం.. నివారణ ఒక్కటే మార్గం కావడంతో... అన్నిదేశాలు అలర్టయ్యాయి. జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మోర్కెల్ మాత్రం కరోనా వైరస్ ప్రపంచానికి పెద్ద సవాల్ విసిరిందని అభిప్రాయపడ్డారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ అతిపెద్ద సమస్యను ఎదుర్కొబోతోందని చెప్పారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రజలు స్వీయ నిర్బంధ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరు చర్యలు తీసుకుంటేనే వైరస్‌ను సమూలంగా అరికట్టొచ్చని అభిప్రాయపడ్డారు. లేదంటే వైరస్ మరింత విసృతమయ్యే పెను ప్రమాదం పొంచి ఉంది అని ఆందోళన వ్యక్తం చేశారు.

బీ అలర్ట్..

బీ అలర్ట్..

కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని.. అందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మోర్కెల్ పేర్కొన్నారు. అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జర్మనీ పునరేకీకరణ, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దేశం ఒక్క పెద్ద సవాల్‌ను ఎదుర్కొబోతుందని వివరించారు. జర్మనీలో ఏంజెలా మోర్కెల్ గత 15 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోన్నారు. ఆ సమయంలో ఆర్థిక సంక్షోభం, 2015లో శరణార్థుల సమయ్య, బ్రిగ్జిట్ లాంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇంతటి క్లిష్ట సమయాల్లోనూ నూతన సంవత్సరం సందర్భంగా మోర్కెల్.. ప్రజలతో మమేకమయ్యారు. కానీ కరోనా వైరస్ దెబ్బకు టీవీలో మాట్లాడాల్సి వచ్చిందని.. పరిస్థితి అంతలా దిగజారిందని వివరించారు. క్లిష్ట సమయంలో కూడా పౌరులు దూరంగా ఉంటే.. వైరస్‌ను సమర్థంగా, ఎదుర్కొని పారద్రోలాలని పేర్కొన్నారు. వైరస్‌ ప్రబలకుండా ఉండేందుకు జర్మనీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్లు, కాలేజీలు, వ్యాపార సముదాయాలను మూసివేసిన సంగతి తెలిసిందే.

 ఆంక్షలు..

ఆంక్షలు..

వైరస్ ప్రబలుతోన్న నేపథ్ంలో ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, స్పెయిన్ ప్రజలను ఇంట్లోనే ఉండాలని ఆదేశించింది. కానీ జర్మనీ మాత్రం ఆ విధంగా ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొన్నది. ఎందుకంటే జర్మనీలో వేసవి ప్రారంభమవుతోన్న నేపథ్యంలో.. ఇంట్లో ఉండటం కంటే బయట తిరిగితేనే వైరస్ చనిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గుమికూడొద్దని మాత్రం స్పస్టంచేస్తోంది.

సరిహద్దు ప్రాంతాలు..

సరిహద్దు ప్రాంతాలు..

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలను మరింత క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయా అధికారులను మోర్కెల్ ఆదేశించారు. వాస్తవానికి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన మోర్కెల్.. సరిహద్దుల్లో తనిఖీలు చేయడానికి వ్యతిరేకం.. కానీ క్లిష్ట సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కానీ ప్రజారోగ్యం దృష్ట్యా తాత్కాలికంగా కఠిన నిర్ణయాలు తప్పవని పేర్కొన్నారు.

Recommended Video

కరోనా Thermal Scanning Center At TDP Central Office | Oneindia Telugu
నౌక తనిఖీలు కూడా..

నౌక తనిఖీలు కూడా..

ఫ్రాన్స్, ఆస్ట్రియా, లాగ్జెమ్‌బర్గ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్ నుంచి వచ్చే ట్రక్కులను సరిహద్దు అధికారులు సోమవారం నిశీతంగా తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. రోడ్డు మార్గమే కాకుండా సముద్ర, వాయు మార్గాలపై కూడా ఆంక్షలు అమలు చేస్తామని జర్మనీ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయాదేశాల నుంచి వచ్చే విమానాలతోపాటు డెన్మార్క్ నుంచి వచ్చే నౌకలను కూడా ముమ్మరం తనిఖీలు చేస్తామని పేర్కొన్నారు. జర్మనీలోకి అత్యవసరంగా రావాల్సిన వారు సంబంధిత ధృవపత్రం సమర్పించాలని కోరారు.

English summary
Germany is facing its biggest challenge "since the Second World War" in the fight against the coronavirus pandemic, Chancellor Angela Merkel said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X