Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2025లో భారీ నష్టాలను మిగిల్చిన టాప్ 10 ప్రకృతి విపత్తులు ఇవే..?

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ప్రకృతి విపత్తులు మానవాళినికి తీరని నష్టాన్ని మిగిల్చాయి. వడగాల్పులు, కార్చిచ్చులు, కరువు, తుపానులు, వరదలు వంటి 10 ప్రధాన విపత్తుల వల్ల ప్రపంచానికి దాదాపు 122 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.10.77 లక్షల కోట్లు) ఆర్థిక నష్టం వాటిల్లినట్లు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.

వాతావరణ మార్పుల ప్రభావమే కారణమా..?

ఈ నివేదిక ప్రకారం గ్లోబల్ వార్మింగ్, అసమతుల్య వర్షపాతం, ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి వాతావరణ మార్పుల ప్రభావమే ఈ విపత్తులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రకృతి ప్రకోపాలు ఇప్పుడు అరుదైన ఘటనలుగా కాకుండా, తరచూ సంభవించే విపత్తులుగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

global-natural-disasters-in-2025-and-economic-losses-insured-analysis

టాప్ 10 ఇవే..!

1.కాలిఫోర్నియా కార్చిచ్చు..

ఆర్థికంగా అత్యంత భారీ నష్టాన్ని కలిగించిన ఘటనగా అమెరికాలోని కాలిఫోర్నియా కార్చిచ్చులు నిలిచాయి. సుమారు 60 బిలియన్ డాలర్ల నష్టం జరగగా.. 400 మందికి పైగా మృతి చెందారు. వేలాది ఇళ్లు, వ్యాపార సముదాయాలు దగ్ధం అయ్యాయి.

2.ఆగ్నేయాసియాలో తుపానులు, వరదల విధ్వంసం..

ఆగ్నేయాసియా దేశాలను వరదలు, తుపానులు అతలాకుతలం చేశాయి. వీటి వల్ల 25 బిలియన్ డాలర్లు నష్టం జరగ్గా.. 1,750 మంది మృతి చెందారు. థాయ్‌లాండ్, ఇండోనేసియా, శ్రీలంక, వియత్నాం, మలేసియా వంటి దేశాల్లో పంటలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

3. చైనాలో భారీ వరదలు..

చైనాలో సంభవించిన వరదలు 11.7 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం మిగిల్చాయి. వేలాది గ్రామాలు ముంపునకు గురి కాగా.. లక్షలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. రవాణా వ్యవస్థలు, పరిశ్రమలు నెలల తరబడి నిలిచిపోయాయి.

4. యూరప్ కార్చిచ్చులు..

బ్రెజిల్‌లో తీవ్రమైన కరువు, స్పెయిన్, పోర్చుగల్‌లలో కార్చిచ్చులు విస్తృత నష్టాన్ని మిగిల్చాయి.
అడవులు ధ్వంసమవడం, నీటి కొరత పెరగడం వల్ల వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది.

5. దక్షిణ అమెరికాలో కార్చిచ్చు..

కార్చిచ్చులు విస్తృత నష్టాన్ని మిగిల్చాయి. అడవులు ధ్వంసమవడం వల్ల వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది.

6. ఆస్ట్రేలియాలో తుపాను..

ఆస్ట్రేలియా తీరప్రాంతాల్లో సంభవించిన తుపానులు తీర ప్రాంతాలను విధ్వంసం చేశాయి. మత్స్యకార జీవనోపాధులు, తీర ప్రాంత మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

7. ఆఫ్రికా తీరాల్లో

ఆఫ్రికా తీరప్రాంతాల్లో సంభవించిన తుపానులు తీర ప్రాంతాలను విధ్వంసం చేశాయి.

8. భారత్ లో వరదల బీభత్సం..

భారత్‌లో పలు రాష్ట్రాల్లో భారీ వరదలు సంభవించి పంట నష్టం, రహదారులు, వంతెనలు ధ్వంసం అయ్యాయి.

9. పాకిస్థాన్‌లో వరదలు..

పాకిస్థాన్‌లో పరిస్థితి మరింత భయంకరంగా మారింది. ఈ దుర్ఘటనల్లో 1,860 మంది మృతి చెందగా.. 70 లక్షల మంది ప్రభావితం అయ్యారు. మొత్తంగా 6 బిలియన్ డాలర్ల నష్టం జరిగింది.

10. ఫిలిప్పీన్స్‌లో టైఫూన్‌ల విధ్వంసం..

ఫిలిప్పీన్స్‌లో వరుసగా సంభవించిన టైఫూన్‌లు లక్షలాది మందిని తరలింపునకు దారితీశాయి. 5 బిలియన్ డాలర్లకు పైగా నష్టం జరగ్గా..

ఈ నివేదిక ప్రధానంగా బీమా క్లెయిమ్స్ ఆధారంగా రూపొందించబడిందని స్పష్టం చేసింది. అయితే వాస్తవ ఆర్థిక నష్టం, మానవ నష్టం ఈ అంచనాల కంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అంతే కాకుండా ధనిక దేశాల్లో బీమా వినియోగం ఎక్కువగా ఉండటంతో నష్టాల గణాంకాలు స్పష్టంగా నమోదవుతున్నాయి. కానీ పేద దేశాల్లో బీమా కవరేజ్ తక్కువగా ఉండటంతో వాస్తవ నష్టాలు గణాంకాల్లో పూర్తిగా ప్రతిబింబించడంలేదని.. అక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కాగా వాతావరణ మార్పులను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు తక్షణ చర్యలు తీసుకోకపోతే, రాబోయే సంవత్సరాల్లో ఇలాంటి విపత్తులు మరింత తీవ్రతరం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ఆర్థిక సమస్య కాకుండా, మానవ భవిష్యత్తుకు ముప్పుగా మారుతుందని నివేదిక స్పష్టం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+