వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివక్ష: గూగుల్ లో లేడీ టెక్కీలకు తక్కువ వేతనాలు, ఈక్వల్ పే డే ప్రకటన

గూగుల్ అంతర్జాతీయంగా పేరొందిన టెక్ దిగ్గజం.అయితే ఈ సంస్థలో పురుషుల కంటే మహిళలకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్ ఆరోపిస్తోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: గూగుల్ అంతర్జాతీయంగా పేరొందిన టెక్ దిగ్గజం.అయితే ఈ సంస్థలో పురుషుల కంటే మహిళలకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్ ఆరోపిస్తోంది.

మహిళ ఉద్యోగుల పట్ల గూగుల్ వివక్ష చూపుతోందని గూగుల్ ఆరోపిస్తోంది.గూగుల్ లో వేతనాల చెల్లింపులో అసమానతలున్నాయని డిఓఎల్ గుర్తించినట్టుగా ఓ పత్రిక రిపోర్టు చేసింది.

పురుషులకు సమానంగా మహిళలు పనిచేస్తున్నా గూగుల్ వారికి సరిపడే వేతనం చెల్లించడం లేదని ప్రభుత్వ ఇన్వెస్టిగేటర్లు గుర్తించారని ఆ పత్రిక వెల్లడించింది.

Google accused of discriminating against female employees, underpaying them

అయితే గూగుల్ మాత్రం తాము ఎలాంటి అసమానతలను చూపడం లేదని వాదిస్తోంది. ఈ ఆరోపణలను ప్రారంభమైన తర్వాత గూగుల్ ఈక్వల్ పే డేను ప్రకటించింది.

లింగ వివక్షతను నిర్మూలించడానికి ఈక్వల్ పే డేను తీసుకొచ్చినట్టుగా గూగుల్ ట్వీట్ చేసింది. కానీ, ఫెడరల్ ఎంప్లాయిమెంట్ చట్టాలను గూగుల్ ఉల్లంఘిస్తోందని ప్రభుత్వం చెబుతోంది.

గూగుల్ వంటి పెద్ద కంపెనీలో మహిళలపై వివక్ష చూపించడం నిజంగా చాలా తీవ్రమైన చర్యగా డీఓఎల్ చెబుతోంది.

ప్రతి ఏటా తాము వేతన చెల్లింపుల్లో సమగ్ర విచారణ చేపడుతామన్నారు. కానీ, ఎక్కడా కూడ వివక్ష చూపినట్టు తేలలేదని గూగుల్ అధికార ప్రతినిధి చెప్పారు.

English summary
The US Department of Labour (DoL) has accused Google of discriminating against its female employees by paying them less than their male counterparts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X