గూగుల్ సరికొత్త ఆవిష్కరణలు! ‘గూగుల్ లెన్స్’తో సమాచార విప్లవం!

Posted By:
Subscribe to Oneindia Telugu

కాలిఫోర్నియా: టెక్ దిగ్గజం గూగుల్ డెవలపర్ల వార్షిక సమావేశం కోసం టెక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈసారి గూగుల్ ఎలాంటి కొత్త ఉత్పత్తులు తీసుకొస్తుందో అని ఆసక్తి చూపుతుంటారు.

అందరి ఊహలకు తగ్గట్లే మొన్న కాలిఫోర్నియా మౌంటెన్ వ్యూలోని తన ప్రధాన కార్యాలయంలో గూగుల్ ఈ సమావేశం నిర్వహించింది. టెక్ అభిమానుల ఆసక్తి మేరకు గూగుల్ నిజంగానే సరికొత్త ఫీచర్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది.

అందరినీ ఆకట్టుకున్న ‘గూగుల్ లెన్స్'...

అందరినీ ఆకట్టుకున్న ‘గూగుల్ లెన్స్'...

ఆండ్రాయిడ్ గో, కొత్త వీఆర్ హెడ్ సెట్, గూగుల్ లెన్స్ ఇలాంటి కొన్ని కీలకమైన వాటిని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ డెవలపర్ల సమావేశంలో ప్రకటించారు. వీటన్నంటిల్లో టెక్ అభిమానులను ఎక్కువగా ఆకట్టుకున్నది గూగుల్ లెన్స్. దీన్ని టెక్నాలజీలో మరో విప్లవంగా అభివర్ణించిన సుందర్ పిచాయ్, అసలు గూగుల్ లెన్స్ యూజర్లకు ఎలా ఉపయోగపడుతుందో వివరించారు.

ఫొటో తీసి.. ఇమేజ్ సెర్చ్ ద్వారా...

ఫొటో తీసి.. ఇమేజ్ సెర్చ్ ద్వారా...

ఇప్పటి వరకు మనం దేనిగురించైనా సమాచారం కావాలంటే గూగుల్ ‘టెక్స్ట్' ఎంటర్ చేసి వెతికేవాళ్లం. ఇప్పుడు గూగుల్ లెన్స్ ద్వారా మన స్మార్ట్ ఫోన్ లో దేన్నైనా ఫొటో తీసి సెర్చ్ చేసుకోవచ్చు. అంటే మనకు సమాచారం కావాల్సిన వస్తువును ఫోటో తీసి ఇమేజ్ సెర్చ్ చేస్తే చాలు. దాన్ని గురించి పూర్తి సమాచారం మన ముందుంటుంది.

గూగుల్ లెన్స్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు...

గూగుల్ లెన్స్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు...

ఇందుకు మనం చేయాల్సింది మన స్మార్ట్ ఫోన్లో ‘గూగుల్ లెన్స్' యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడమే. ఉదాహరణకు మనకో పువ్వు కనిపించింది అనుకుందాం. అదేం పువ్వు, దాని వివరాలు తెలుసుకోవాలంటే ఆ పువ్వును గూగుల్ లెన్స్ లో ఫోటో తీస్తే చాలు దానికి సంబంధించిన సమాచారం మొత్తం వచ్చేస్తుంది.

వంటకం ఫొటో తీస్తే.. ఫుల్ డీటెయిల్స్

వంటకం ఫొటో తీస్తే.. ఫుల్ డీటెయిల్స్

అలాగే మనకు తెలియని ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి లాంగ్వేజ్ మనకు అర్థం కాకపోవచ్చు. ఏదైనా రెస్టారెంట్ కు వెళ్లి తిన్నాలన్నా, ఆర్డర్ చేయాలన్నా జంకుతాం. దీనికోసం జస్ట్ మీముందున్న వంటకాన్ని ఫోటో తీసి గూగుల్ లెన్స్ లో ఇమేజ్ సెర్చ్ చేస్తే చాలు దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ప్రత్యక్షమవుతాయి.

గూగుల్ లో ఉంటేనే...

గూగుల్ లో ఉంటేనే...

ఇలా ఇమేజ్ సెర్చ్ తోనే అన్నింటి వివరాలను యూజర్లు తెలుసుకునేలా గూగుల్ ఈ ఆప్షన్ ను ప్రవేశపెట్టింది. అయితే మనం స్కాన్ చేసే వస్తువు వివరాలు గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఉంటేనే, దాన్ని సమాచారం మనం పొందగలుగుతాం. గూగుల్ లెన్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ వినూత్న ఫీచర్ త్వరలోనే స్మార్ట్ ఫోన్లలోకి అందుబాటులోకి వస్తుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At Google’s I/O developer conference, CEO Sundar Pichai announced a new technology called Google Lens. The idea with the product is to leverage Google’s computer vision and AI technology in order to bring smarts directly to your phone’s camera. As the company explains, the smartphone camera won’t just see what you see, but will also understand what you see to help you take action. During a demo, Google showed off how you could point your camera at something and Lens tells you what it is — like, it could identify the flower you’re preparing to shoot.
Please Wait while comments are loading...