గూగుల్ సంచలన నిర్ణయం: ఆ యూజర్లకు డ్రైవ్ సేవలు నిలిపివేత, ఎప్పట్నుంచంటే?
న్యూయార్క్: సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్(Google) కీలక నిర్ణయం తీసుకుంది. మారుతున్న సాంకేతికకు అనుగుణంగా యూజర్లకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో గూగుల్ సంచలన ప్రకటన చేసింది. ఆగస్టు 2023 నుంచి విండోస్(Window; 32-బిట్ వెర్షన్) ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్న యూజర్లకు గూగుల్ డ్రైవ్ సేవలు నిలిపివేయనున్నట్లు వెల్లడించింది.
ఇందులో భాగంగా విండోస్ 8, విండోస్ 8.1, విండోస్ సర్వర్-2012 యూజర్లకు ఇకపై గూగుల్ డ్రైవ్(Google Drive) సేవలు ఈ ఏడాది ఆగస్టు నుంచి అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. ప్రస్తుతం విండోస్ 8(32 బిట్ వెర్షన్) ఓఎస్ ఉపయోగిస్తున్న యూజర్లు తమ కంప్యూటర్లలో ఓఎస్‌ను విండోస్ 10 (64 బిట్ వెర్షన్)కు అప్‌గ్రేడ్ చేసుకోవాలని సూచించింది.

అయితే, గూగుల్ బ్రౌజర్ ద్వారా యూజర్లు డ్రైవ్‌ను యాక్సెస్ చేసుకోవచ్చని తెలిపింది. సైబర్ దాడులు, యూజర్ డేటా భద్రత వంటివాటి దష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది. కాగా, ప్రస్తుతం డ్రైవ్ యాప్, డెస్క్‌టాప్ వెర్షన్లలో అందుబాటులో ఉంది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో డ్రైవ్‌లో కొత్త ఫైల్స్ క్రియేషన్, స్టోరేజీపై గూగుల్ పరిమితి విధించింది. దీంతో గతంలో మాదిరిగా యూజర్లు అపరిమిత ఫైల్స్ క్రియేట్ చేసుకునే అవకాశం లేదు. కేవలం ఐదు మిలియన్ ఫైల్స్‌ను మాత్రమే క్రియేట్ చేసుకునే అనుమతి ఉంటుంది. దీంతోపాటు డ్రైవ్‌లో సెర్చ్ చిప్స్ పేరుతో కొత్త ఫీచర్‌ను గూగుల్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు తమకు అవసరమైన ఫైల్స్‌ను ఫిల్టర్ల సాయంతో వేగంగా గుర్తించవచ్చని గూగుల్ పేర్కొంది.












Click it and Unblock the Notifications