Viral Video: తాగితే మామూలుగా ఉండదుగా.. వైరల్ అయిన వీడియో..
చాలా మంది మద్యం తాగిన తర్వాత ఏం చేస్తారో వారికే తెలియదు. వారితో మందు ఏమైనా చేయిస్తుంది. ఇలానే ఓ వ్యక్తి తాగిన మైకంలో చేసిన పనికి అక్కడున్న వారు భయాందళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఓ వేడుకకు హాజరయ్యాడు. వేడుకలో మందు తాగాడు. తాగిన తర్వాత ఉరికే ఉంటాడా.. మిగతా వారితో కలిసి కాకర పుల్లలు కాల్చాడు.
This how drunk I’m tryna be at my wedding pic.twitter.com/RchInxywDa
— Thomas (@ThomasMightSnap) July 2, 2022
ఆపిన ఆగడం లేదు
ఒక్కటి కాకుండా కుడి చేతిలో ఒకటి, ఎడమ చేతిలో ఒక కాకర పుల్ల పట్టుకుని మహిళ వద్దకు వెళ్లి డ్యాన్స్ చేశాడు. పనిలో పనిగా పక్కనున్న గడ్డికి అగ్గి పెట్టాడు. ఏముంది మంటలు వచ్చాయి. అందరు భయంతో ఉంటే అతను మాత్రం మండుతున్న గడ్డిని చేతులు కింద పడేశాడు. కాళ్లతో తొక్కాడు. అక్కడి వారు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. తర్వాత మళ్లీ డ్యాన్స్ కూడా చేశాడు. ఈ మొత్తం తతంగాన్ని ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో చిత్రీకరించి టిక్ టాక్ లో పెట్టాడు. ఆ టిక్ టాక్ వీడియోను థామస్ అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

మిలియన్ల వ్యూస్
ఈ వీడియోకు 13 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కొంతమంది నెటిజన్లు అతని చేష్టలకు నవ్వుకోగా.. మరికొందరు ఇది పెద్ద ప్రమాదం తప్పిందని రాసుకొచ్చారు.












Click it and Unblock the Notifications