దుబాయ్, అబుదాబీలో భారతీయులకు గుడ్ న్యూస్..!

ఇజ్రాయెల్, అమెరికా మొదలుపెట్టిన యుద్ధం, దానికి ప్రతిగా ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో (gulf countries) ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్ధితి నెలకొంది. ఇరాన్ ప్రతీకార దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలన్నీ క్రమంగా తమ గగనతలాల్ని మూసేయడం ప్రారంభించాయి. దీంతో అక్కడ ఉన్న భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. వీరిని క్షేమంగా స్వదేశానికి తరలించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

ఈ నేపధ్యంలో ఇవాళ రాత్రి నుంచి తిరిగి విమానాల (flight) రాకపోకలు పరిమితంగా ప్రారంభిస్తున్నట్లు దుబాయ్ (dubai), అబుదాబీ (abu dhabi)ప్రకటించాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా కొన్ని రోజులుగా తలెత్తిన పరిస్ధితుల తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతటా విమాన ప్రయాణం క్రమంగా సాధారణ స్థితికి తిరిగి రావడం ప్రారంభించింది. ఇందులో భాగంగా దుబాయ్, అబుదాబి పరిమిత విమాన కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి.

Gulf Tensions Limited Flight Operations to Resume from Dubai and Abu Dhabi Today

గల్ఫ్ దేశాల్లో గగనతలాల మూసివేత తర్వాత అక్కడ చిక్కుకున్న వేలాది మంది ప్రయాణికులకు ఉపశమనం కలిగించే విధంగా ఇవాళ సాయంత్రం నుండి ఎంపిక చేసిన సేవలు తిరిగి ప్రారంభమవుతాయని అధికారులు, విమానయాన సంస్థలు ప్రకటించారు.ఫ్లైదుబాయ్ పరిమిత షెడ్యూల్‌ను నడపడం ప్రారంభిస్తుందని దుబాయ్ మీడియా ధృవీకరించింది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ కూడా తక్కువ సంఖ్యలో సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే బుకింగ్‌లు చేసుకున్న ప్రయాణీకులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. ఈ పరిమిత విమానాలలో ప్రయాణించడానికి తిరిగి బుక్ చేసుకున్న వారిని ఎమిరేట్స్ నేరుగా సంప్రదిస్తుందని వెల్లడించింది. వివరాలు లేకుండా మాత్రం విమానాశ్రయానికి వెళ్లవద్దని కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+