ప్రతీకారంతో మిషన్ గన్ తో కాల్పులు: ముగ్గురు పోలీసుల మృతి
కరాచీ: ప్రతీకారంతో అగంతకుడు పోలీసులు, పౌరుల వాహనాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు. ఈ దాడులలో ముగ్గురు పోలీసులు మరణించి పలువురు గాయపడ్డారు. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని అధికారులు తెలిపారు.
బుధవారం పాకిస్థాన్ లోని కరాచీలోని బంగోరియా గొతి ప్రాంతంలో ఒక అగంతకుడు మిషన్ గన్ తీసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అక్కడ ఉన్న పోలీసులు, అటు వైపు వెళుతున్న వాహనాల మీద బుల్లెట్ లు దూసుకు వెళ్లాయి.

ఈ కాల్పులలో ఒక ఎస్ఐ, ఇద్దరు పోలీసులు సంఘటనా స్థలంలో మరణించారు. ఒక పోలీసుకు తీవ్రగాయాలైనాయని ఒక పోలీసు అధికారి తెలిపారు. వాహనాలలో వెళుతున్న వారికి గాయాలైనాయి. కాల్పులు జరిపిన అగంతకుడు అక్కడి నుండి చాకచక్యంగా తప్పించుకున్నాడు.
గొతి ప్రాంతంలో తాలిబన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. మంగళవారం భద్రత దళాలు సోదాలు చేస్తు జరిపిన కాల్పులలో నలుగురు తాలిబన్లతో సహ 7 మంది ఉగ్రవాదులు అంతం అయ్యారని అధికారులు చెప్పారు. అందుకు ప్రతీకారంగానే అగంతకుడు కాల్పులు జరిపి ఉంటాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications