H-1B: హెచ్1బీ కొత్త విధానంలో వీరికి పెరిగిన ఛాన్స్? తాజా మార్పులివే..!

అమెరికాాలో హెచ్1బీ వీసాల జారీ కోసం కొత్తగా అమల్లోకి వస్తున్న వేతనాల ఆధారిత విధానంపై భారత్ లో దరఖాస్తుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అమెరికాలో కంపెనీలు విదేశీ నిపుణుల్ని నియమించుకునేందుకు వీలుగా అక్కడి ప్రభుత్వం వారికి హెచ్1బీ (H-1B)వీసాలు జారీ చేస్తోంది. వీటికి భారత్, చైనా వంటి దేశాల్లో గట్టి పోటీ ఉంది. తాజాగా అమెరికాలో ట్రంప్ సర్కార్ హెచ్1బీ వీసాల వల్ల విదేశీ నిపుణులు స్థానికుల ఉద్యోగాల్ని దొంగిలిస్తున్నారనే ఆరోపణలతో వీటి జారీలో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకూ ఉన్న లాటరీ విధానం స్ధానంలో కొత్తగా వేతనాల ఆధారిత హెచ్1 వీసాల జారీ విధానం తీసుకొచ్చింది.

అమెరికా కంపెనీలు తమ ఉద్యోగులకు హెచ్1బీ వీసాలు కొత్తగా పొందాలంటే ప్రతీ ఒక్కరికీ లక్ష డాలర్ల చొప్పున ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన తెచ్చాక తాజాగా లాటరీ విధానం స్ధానంలో వేతనాల ఆధారిత వీసాల జారీ విధానాన్ని కూడా అమల్లోకి తెస్తున్నట్లు ట్రంప్ సర్కార్ ప్రకటించింది. అమెరికా కార్మికుల వేతనాలు, పని పరిస్థితులు, ఉద్యోగ అవకాశాలను రక్షించడమే లక్ష్యంగా కొత్త విధానం తెచ్చినట్లు తెలిపింది. దీంతో ఎక్కువ నైపుణ్యం, అధిక వేతనాలు పొందే దరఖాస్తుదారులకు హెచ్-1బీ వీసాలు కేటాయించే అవకాశం ఉంటుంది.

H-1B Wage-Based Selection Higher Pay Gets Priority Over Lottery Luck Explainer

హెచ్-1బీ వీసా ఎంపిక విధానంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పద్ధతి ప్రకారం, ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ల తర్వాత రాండమ్ లాటరీ ద్వారా వీసాలను కేటాయిస్తున్నారు. ఏడాదికి 85వేల వీసాల కోటా (65,000 సాధారణ వీసాలు మరియు ఉన్నత విద్యావంతులకు 20,000 అదనపు వీసాలు) ఉన్నప్పటికీ.. దరఖాస్తుల కోటా పెరిగిపోవడంతో ఇలా లాటరీ ద్వారా కేటాయిస్తున్నారు. అయితే ఇందులో అక్రమాలు జరుగుతున్నాయనే సాకుతో వేతనాల ఆధారిత విధానానికి మార్చేశారు.

H-1B Wage-Based Selection Higher Pay Gets Priority Over Lottery Luck Explainer

కొత్త విధానం ప్రకారం ఇకపై హెచ్1బీ వీసాలను కేవలం లాటరీ అదృష్టం ఆధారంగా కాకుండా, అమెరికా కార్మిక విభాగం (DOL) నిర్దేశించిన వేతన స్థాయిల ఆధారంగా కేటాయిస్తారు. దీంతో అధిక జీతం పొందేవారికి వీసా లభించే అవకాశాలు పెరుగుతాయి. 2027 ఆర్ధిక సంవత్సరం హెచ్1బీ క్యాప్ రిజిస్ట్రేషన్ సీజన్‌కు ముందు.. 2026 ఫిబ్రవరి 27 నుండి ఇది అమలులోకి వస్తుంది. సాధారణంగా హెచ్1బీ ఈ-రిజిస్ట్రేషన్లు మార్చిలో ప్రారంభమవుతాయి. లాటరీ వల్ల కొన్ని కంపెనీలు తక్కువ వేతనాలతో దరఖాస్తులను పెద్ద సంఖ్యలో దాఖలు చేసి అమెరికన్ కార్మికులకు నష్టం కలిగిస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+