Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొంప కొల్లేరు చేసిన H1B Visa

H-1B వీసా ఫీజు పెంపు వ్యవహారం భారతీయుల కొంప ముంచుతోంది. అమెరికా వెళ్లాలనుకునే వాళ్ల కలలు కల్లలు చేస్తోంది. చదువు, ఉద్యోగంతో పాటు చివరికి పర్యాటకం కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. ఒక్క H1B visa మాత్రమే కాకుండా దాదాపుగా అన్ని రకాల విసాలకు చెల్లించాల్సిన ఫీజులు భారంగా పరిణమించాయి. ఫీజులు పెంచిన తర్వాత రెండు నెలల కాలంలోనే వీసా దరఖాస్తులు సగానికి పైగా పడిపోయినట్లు నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (NFAP) వెల్లడించింది.

2025 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఐటీ కంపెనీలకు H-1B వీసాల ఆమోదాలు 70 శాతం మేర తగ్గిపోయాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. NFAP విడుదల చేసిన నివేదిక ప్రకారం- ప్రారంభ నియామకాల కోసం ఏడు భారతీయ ఐటీ సంస్థలకు 4,573 వీసాలు మాత్రమే మంజూరు అయ్యాయి. ఇది 2015 తో పోలిస్తే 70 శాతం మేర తగ్గింది. 2024తో పోలిస్తే 37 శాతం క్షీణత కనిపించింది. లక్ష డాలర్ల మేర హెచ్1బీ వీసా ఫీజు పెంపు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దీనికి కారణం.

H1B Approvals for Indian Tech Companies Dwindle to 10-Year Low Under 100K Dollar Fee

H-1B అప్రూవల్స్ లల్లో టాప్ 5 భారతీయ సంస్థల్లో TCS ఒక్కటే నిలిచింది. జాబ్ ఓపెనింగ్స్ తో పాటు ఇప్పుడు ఉద్యోగాల కోసం 5,293 అప్రూవల్స్ పొందింది. టీసీఎస్ రిజెక్ట్ రేటు 2024 కంటే ఈ సారి భారీగా పెరిగింది. గత ఏడాది ఈ రేటు నాలుగు శాతం ఉంటే ఇప్పుడది ఏడుకు పెరిగింది. అప్రూవల్స్ కోసం టీసీఎస్ పంపించిన దరఖాస్తులు గతంలో నాలుగు శాతం వరకే రిజెక్ట్ అయ్యేవి. ఇప్పుడు ఏడు శాతం మేర తిరస్కరణకు గురి అయ్యాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే కొనసాగుతున్న ఉద్యోగాల కోసం హెచ్1బీ పిటిషన్ల తిరస్కరణ రేటు 1.9 శాతం. గత ఏడాది ఇది 1.8గా ఉండేది. ఈ ఏడాది టీసీఎస్ కు ప్రారంభ ఉద్యోగాల కోసం కేవలం 846 ఆమోదాలు మాత్రమే లభించాయి. గత ఏడాదితో పోల్చుకుంటే సగానికి తగ్గినట్టే. 2024లో 1,452 అప్రూవల్స్ లభించాయి ఈ సంస్థకు.

2025లో ఓపెనింగ్ H-1B పిటిషన్ల ఆమోదాలు పొందిన టాప్ 25 కంపెనీలలో మూడు భారతీయ సంస్థలు మాత్రమే ఉన్నాయని న్యూస్‌వీక్ వివరించింది. అప్రూవల్ పొందిన ఈ పిటీషన్లల్లో అమెజాన్ అగ్రస్థానంలో నిలిచింది ఈ సంస్థకు మొత్తం 4,644 అప్రూవల్స్ లభించాయి. దీని తర్వాత మెటా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. మెటా- 1,555, మైక్రోసాఫ్ట్- 1,394, గూగుల్- 1,050 ఉన్నాయి. తొలి నాలుగు స్థానాలను కూడా అమెరికన్ సంస్థలు కైవసం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికన్ కంపెనీలు టాప్ నిలవడం ఇదే తొలిసారి.

కొత్త H-1B ప్రొఫెషనల్స్ ను నియమించుకోవడానికి అనుమతి పొందిన తొలి అయిదు కంపెనీల్లో భారతీయ ఐటీ కంపెనీ టీసీఎస్ ఒక్కటే. మొత్తం 846 అప్రూవల్స్ ను పొందిందీ సంస్థ. ఇప్పటికే కొనసాగుతున్న ఉద్యోగాల కోసం అమెజాన్- 14,532, టీసీఎస్- 5,293, మైక్రోసాఫ్ట్- 4,863, మెటా-4,740, ఆపిల్- 4,610, గూగుల్ -4,509 ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+