వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నూకలున్నాయ్... నీటిలో కొట్టుకుపోతోన్న అతడిని ఎలా రక్షించారంటే? (వీడియో)

ఎమరాల్డ్ పూల్స్ అంటేనే చాలు ఒళ్ళు గగుర్పొడుస్తోంది. కాలిఫోర్నియాలో పదునైన రాతి లోయల మధ్య ఈ జలపాతం ప్రవహిస్తోంది. ఈ జలపాతం వద్దకు వెళ్ళేవారు అనేక జాగ్రత్తలు తీసుకొంటారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా: ఎమరాల్డ్ పూల్స్ అంటేనే చాలు ఒళ్ళు గగుర్పొడుస్తోంది. కాలిఫోర్నియాలో పదునైన రాతి లోయల మధ్య ఈ జలపాతం ప్రవహిస్తోంది. ఈ జలపాతం వద్దకు వెళ్ళేవారు అనేక జాగ్రత్తలు తీసుకొంటారు.

మంచుకరిగే వేసవిలో ఇవి మరింత ఉధృతంగా పరుగులు తీస్తుంటాయి. అదే సమయంలో చూడగానే చూపరులను ఆకట్టుకొంటాయి. ఓ సారి సరదాగా అందులో దిగి స్మిమ్మింగ్ చేస్తే బాగు అని కూడ అనిపిస్తోంది.

ఒకవేళ అదృష్టం బాగాలేక పట్టుతప్పిందో ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఈ నెల 24వ, తేది మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కలానీ ట్యోనో అనే యువకుడికి ఇదే అనుభవం ఎదురైంది.

సరదాగా జలపాతంలోకి దిగి స్నానం చేయాలనుకొన్నాడు ట్యోనో. అయితే అతడు ఒక్కసారిగా పట్టుజారాడు. వేగంగా ప్రవహిస్తున్న నీటిలో కొట్టుకుపోయాడు. దీంతో అతడితో పాటు ఉన్న ఓ వ్యక్తి తన మిత్రుడు జలపాతంలో పడిపోయాడంటూ కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్ సంస్థకు ఫోన్ చేశాడు.

దీంతో హెలిక్యాఫ్టర్ ద్వారా మాత్రమే తనిఖీలు చేసేందుకు అవకాశం ఉన్న ఆ ప్రాంతంలో ప్రత్యేక హెలిక్యాప్టర్ ను రంగంలోకి దించారు.

అరగంటసేపు గాలింపు చేపట్టిన తర్వాత నీటిమధ్య ఓ పెద్దబండరాయి మీద కూర్చొని సహయం కోసం ఎదురుచూస్తున్న ఓ యువకుడు కన్పించాడు. దీంతో సుశిక్షితుడైన గజఈతగాడిని హెలిక్యాప్టర్ నుండి ప్రత్యేక తాడు సహయంతో జలపాతంలోకి దింపారు. గజ ఈతగాడు ట్యోన్ ను రక్షించాడు. వారిద్దరని హెలిక్యాప్టర్ లో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సకాలంలో పోలీసులు స్పందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

English summary
The Emerald Pools trail in California is known for its slot canyons, waterfalls and pools of water pouring over granite boulders. As picturesque as that sounds, however, the area is quite dangerous - especially during summers when snowmelt is high. Reports of people dying by falling down while hiking or getting swept away while swimming are not uncommon. So on June 24, Kalani Tuiono was a very lucky man to be rescued safely from Emerald Pools.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X