వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘బీచ్‌లలో తలలు లేని శరీరాలు’... ఆ పట్టణంలో ఏం జరుగుతోంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మొజాంబిక సైన్యం, మిలిటెంట్ల మధ్య యుద్ధం జరుగుతోంది

ఆఫ్రికన్ దేశం మొజాంబిక్‌లోని పల్మా పట్టణాన్ని ఓ సాయుధ ముఠా తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ఆ పట్టణంతో బయటి ప్రపంచానికి కమ్యునికేషన్స్ పూర్తిగా తెగిపోయాయి.

దీంతో ఇప్పుడు అక్కడి పరిస్థితి ఏంటన్నది స్పష్టత లేదు.

ఇక పల్మా పట్టణంపై జరిగిన దాడిలో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయినట్లు మొజాంబిక్ రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒమర్ సరంగా చెప్పారు.

పల్మాలోని ఓ హోటల్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఒమర్ తెలిపారు.

పల్మాలో ఉన్న చాలా మంది జనం అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్గో ఓడలు, పర్యాటకుల పడవలు ఇలా ఏది దొరికితే అందులో అక్కడి నుంచి పారిపోతున్నారు. ఓడల రద్దీని గుర్తించే వెబ్‌సైట్లలో వీటి కదలికలు కనిపించాయి.

హోటల్ నుంచి బయటపడ్డవారిలో చాలా మంది శుక్రవారం రాత్రంతా బీచ్‌లో దాక్కుని, శనివారం ఉదయం ఓ పడవలో అక్కడి నుంచి బయటపడ్డారని బీబీసీకి ఓ కాంట్రాక్టర్ తెలిపారు. అక్కడున్నవారిని కాపాడేందుకు ఆదివారం మరిన్ని బోట్లు వెళ్లాయని చెప్పారు.

పల్మాకు 250 కిలో మీటర్ల దూరంలో ఉన్న పెంబా పట్టణంలోని ఓడ రేవుకు పల్మా నుంచి వచ్చిన సుమారు 1,400 మంది ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నారని సహాయ చర్యల్లో పాలుపంచుకుంటున్న ఒకరు ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.

మొజాంబిక్ ప్రజలు

పల్మా పట్టణం జనాభా సుమారు 75 వేలు. అక్కడ ఇప్పుడు ఎంత మంది చనిపోయారు? ఎంత మంది గాయపడ్డవారున్నారు?... అన్నది స్పష్టంగా తెలియదు.

పల్మా పట్టణంలోని బీచ్‌లలో శవాలు కనిపిస్తున్నాయని, వాటిలో తల లేకుండా కేవలం మొండెం మాత్రమే ఉన్న శవాలూ ఉన్నాయని మొజాంబిక్ పోలీసు శాఖ కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్న ఓ భద్రత సంస్థ అధికారి చెప్పారు.

మొజాంబిక్‌లోని ఉత్తర ప్రాంతంలో 2017 నుంచి తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ముస్లింలు ఎక్కువగా ఉండే కాబో డెల్గాడో ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)తో సంబంధాలున్న మిలిటెంట్ల కారణంగా సంక్షోభం ఏర్పడింది.

ఇప్పటివరకూ ఈ సంక్షోభం కారణంగా 2,500 మందికిపైగా చనిపోయారు. సుమారు ఏడు లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
‘Headless bodies on the beaches’what’s going on in that town?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X