ఘోర ప్రమాదం: కొండచరియలు విరిగిపడి 26మంది మృతి

Subscribe to Oneindia Telugu

ఢాకా: బంగ్లాదేశ్‌లో పెను ప్రమాదం సంభవించింది. భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 26 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా బంగ్లాదేశ్‌లోని ఢాకా, చిట్టగాంగ్‌ నగరాల్లో సోమవారం నుంచీ ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు సంభవించి.. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.

Heavy rains and landslides in Bangladesh kill 26

ఈ ఘటనల్లో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. రంగమతిలో 10 మంది, బందర్బాన్‌లో ఏడుగురు, చిట్టగ్యాంగ్‌లో 8 మంది కొండచరియల కింద సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. భారీ వర్షాలతో అప్రమత్తమైన సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Heavy rains causing multiple landslides over the past three days have killed at least 26 people in different areas of Bandarban.
Please Wait while comments are loading...