• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మా తుఝే సలాం : నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం... మదర్స్ డే ఎలా పుట్టింది..?

|

ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఏదైనా ఉందా అంటే అది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే. నవమాసాలు బిడ్డను తన గర్భంలో జాగ్రత్తగా మోసి... నొప్పులు భరించి ఆ బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అంతేకాదు తన బిడ్డ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది తల్లి. ఇక అమ్మను గురించి ఆ తల్లి ప్రేమను గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కవులు తమదైన శైలిలో వర్ణించారు. " పంచంలో దేశదేశాల్ని చుట్టి, లక్షలాది మందిని కలిసినా అమ్మ వంటి అపురూప వ్యక్తి ఎక్కడా తారసపడలేదు. నేను సంపాదించిందంతా ఆమె చరణాల వద్ద పోసినా ఇంకా బాకీ పడతాను" అని అమ్మ మీద తనకున్న ప్రేమను చాటుకున్నాడు చార్లీ చాప్లిన్‌. అందుకే చరిత్రలో అమ్మకంటూ ఒక రోజును కేటాయించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో ఒక్కోరోజు మాతృదినోత్సవంను జరుపుకుంటారు. అసలు మాతృదినోత్సవం ఎలా వచ్చింది... ఈ రోజు చరిత్ర ఏమిటి..?

  Mother's Day : I Love You Amma - Mothers Day Special | Oneindia Telugu
  ఒక్కో దేశంలో ఒక్కో రోజున జరుపుకునే మదర్స్ డే

  ఒక్కో దేశంలో ఒక్కో రోజున జరుపుకునే మదర్స్ డే

  మాతృదినోత్సవం... ప్రతి తల్లికి ఈ రోజు చాలా ప్రత్యేకం. ఏటా మే రెండో ఆదివారం రోజు మాతృదినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజున పిల్లలంతా తమ తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతారు. అంతేకాదు లోకం విడిచిపోయిన తల్లులకు ఘన నివాళులు అర్పిస్తారు. అయితే మదర్స్‌డేను ఒక్కో దేశంలో ఒక్కో రోజు జరుపుకుంటారు. యూకేలో మే నాల్గవ ఆదివారం జరుపుకుంటారు. మదర్ చర్చి జ్ఞాపకంగా మాతృదినోత్సవాన్ని అక్కడి వారు జరుపుకుంటారు. ఇక గ్రీస్‌లో తూర్పు సనాతన సంప్రదాయం ప్రకారం జీసస్‌ను ఆలయంకు బహూకరించిన నేపథ్యంలో ఈ మదర్స్‌డేను వేడుకగా జరుపుకుంటారు. అరబ్ దేశాల్లో మార్చి 21న మాతృదినోత్సవం జరుపుకుంటారు. ఇక కమ్యూనిస్టు దేశాల్లో మాత్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవంనే మదర్స్‌డేగా కూడా జరపుకుంటారు.

  ఇదీ మదర్స్‌ డే చరిత్ర..!

  ఇదీ మదర్స్‌ డే చరిత్ర..!

  మదర్స్ డే జరపుకోవాలన్న ఆలోచన తొలిసారిగా 1872లో ప్రముఖ రచయిత్రి జూలియా వార్డ్ హొవేకు తట్టింది. ఒక సెలవు రోజున మహిళలందరిని ఒక వేదికపైకి చేర్చి శాంతి ర్యాలీలు తీయాలని భావించారు. ఇక అప్పటి నుంచి కొన్నేళ్ల పాటు ఆమె బోస్టన్‌లో వార్షిక మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేవారు. అయితే నేడు మదర్స్‌డే పేరుతో జరుపుకుంటున్న వేడుక మాత్రం వెస్ట్‌వర్జీనియాకు చెందిన సామాజిక కార్యకర్త అన్నా జార్విస్‌ ప్రవేశ పెట్టినట్లుగా తెలుస్తోంది. తన తల్లి గౌరవార్థం దేశవ్యాప్తంగా సెలవుదినం ప్రకటించాలంటూ పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ నిర్వహించారు. ఆమె తల్లి కమ్యూనిటీ హెల్త్ అడ్వకేట్. గ్రామ స్థాయిలో ఉన్న పిల్లల ఆరోగ్యం కోసం జార్విస్ తల్లి ఎంతగానో కృషి చేశారు.

  మదర్స్‌డేకు అధికారిక గుర్తింపు ఇచ్చిన నాటి అధ్యక్షుడు ఉడ్రో విల్సన్

  మదర్స్‌డేకు అధికారిక గుర్తింపు ఇచ్చిన నాటి అధ్యక్షుడు ఉడ్రో విల్సన్

  తన తల్లి గౌరవార్థం మదర్స్ డే పేరుతో జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ఆమె ప్రచారం నిర్వహించారు. తొలుత ఆమె విన్నపాన్ని తిరస్కరించింది నాటి ప్రభుత్వం. అయితే 1911 అమెరికా దేశం మొత్తం మదర్స్‌డేను సెలవుదినంగా పరిగణించాయి. ఇక 1941లో అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ ప్రతి ఏటా మే రెండవ ఆదివారంను మదర్స్‌డేగా ప్రకటిస్తూ ఓ అధికారిక పత్రంపై సంతకం చేశారు. ఇదిలా ఉంటే మదర్స్‌డే ప్రకటించినందుకు జార్విస్ చాలా సంతోషం వ్యక్తం చేసినప్పటికీ కాలక్రమంలో ఇది కమర్షియల్‌గా మారిపోవడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.అసలు మదర్స్‌డే నిర్వహించాలంటూ ఎందుకు ఉద్యమం తీసుకొచ్చానా అని పలుమార్లు బాధపడ్డారు కూడా. మళ్లీ క్యాలెండర్ నుంచి మదర్స్‌డేను తొలగించాలంటూ మరో ఉద్యమానికి తెరతీశారు.

  English summary
  Mother’s Day is a holiday honoring motherhood that is observed in different forms throughout the world. In the United States, Mother’s Day 2019 occurs on Sunday, May 12. The American incarnation of Mother’s Day was created by Anna Jarvis in 1908 and became an official U.S. holiday in 1914.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X