రెచ్చిన బంగ్లాదేశ్ యువత, 10 హిందూ దేవాలయాలు ధ్వంసం
ఢాకా: దీపావళి పర్వదినాన బంగ్లాదేశ్‌లోని పలువురు హిందువులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. మక్కాలోని పవిత్ర కబ్బను అవమానిస్తూ ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టారన్న ఆరోపణలతో బంగ్లాదేశఅ యువత రెచ్చిపోయింది. కనిపించిన హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు. విగ్రహాలను పెకిలించారు.
అంతేకాదు, హిందువుల ఆస్తులను, వారికి సంబంధించిన దుకాణాల పైన దాడులు చేశారు. దీంతో హిందువులు వణికిపోయారు. బయటకు వచ్చేందుకు భయపడ్డారు. ఇళ్లలోనే గడిపారు.

ఇస్లాంను అవమానిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఢాకాలోని నసీర్ నగర్లో పెద్ద ఎత్తున యువత ఆందోళనకు దిగింది. అనంతరం పది హిందూ దేవాలయాలను, 200 మంది హిందువుల ఇళ్లను ధ్వంసం చేశారు. 8 దుకాణాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 150 మంది హిందువులు గాయపడ్డారు. కాగా, ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్ట్ చేశారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications