Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బంగ్లాదేశ్‌లో కిరాతకం: హిందూ యువకుడిపై కారు ఎక్కించి హత్య!

బంగ్లాదేశ్‌లో హిందువులే లక్ష్యంగా సాగుతున్న హింసాకాండలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాజ్‌బరి జిల్లాలో శుక్రవారం(జనవరి 16, 2026) ఓ హిందూ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. పెట్రోల్ నింపుకుని డబ్బులు చెల్లించకుండా పారిపోతున్న వాహనాన్ని అడ్డుకోవడమే ఆ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది.

అసలేం జరిగిందంటే?
రాజ్‌బరి జిల్లాలోని కరీం ఫిల్లింగ్ స్టేషన్‌లో 30 ఏళ్ల రిపన్ సాహా వర్కర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఒక నల్లటి ఎస్‌యూవీ కారు పెట్రోల్ పంపు వద్దకు వచ్చింది. సుమారు 5,000 టాకా (సుమారు రూ. 3,710) విలువైన ఇంధనాన్ని నింపుకున్న తర్వాత, డ్రైవర్ డబ్బులు ఇవ్వకుండా వాహనాన్ని వేగంగా ముందుకు పోనిచ్చాడు. వెంటనే అప్రమత్తమైన రిపన్ సాహా వాహనాన్ని ఆపేందుకు కారుకు అడ్డంగా నిలబడ్డాడు. అయితే దుండగులు కారును ఆపకుండా అతనిపై నుంచి తొక్కిస్తూ వేగంగా దూసుకెళ్లారు. ఈ ప్రమాదంలో రిపన్ సాహా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Hindu Youth Brutally Killed in Bangladesh Run Over by Car in Rajbari District

రాజకీయ నాయకుడి అరెస్ట్
ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కారు యజమాని అబుల్ హషీమ్ (55), అతని డ్రైవర్ కమల్ హుస్సేన్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు అబుల్ హషీమ్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) జిల్లా మాజీ ట్రెజరర్‌గా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు.

హిందువులే లక్ష్యంగా పెరుగుతున్న దాడులు
బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి 12న సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, మైనారిటీలైన హిందువులపై దాడులు ఆందోళనకరంగా పెరిగాయి. కేవలం డిసెంబర్ 2025లోనే 51 మతపరమైన హింసాత్మక ఘటనలు నమోదైనట్లు 'బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్' వెల్లడించింది. 2022 జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్‌లో దాదాపు 1.31 కోట్లు (7.95%) హిందువులు ఉన్నారు. మైనారిటీ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే ఈ దాడుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని భావిస్తున్నారు.

ఇటీవలి కాలంలో జరిగిన మరికొన్ని హత్యలు:

*డిసెంబర్ 2: నర్సింగ్డిలో జ్యువెలరీ వ్యాపారి ప్రంతోష్ సర్కార్ కాల్చివేత.

*డిసెంబర్ 18: మైమెన్‌సింగ్‌లో దైవదూషణ ఆరోపణలతో దీపు చంద్ర దాస్ అనే యువకుడిని గుంపుగా కొట్టి చంపి నిప్పంటించారు.

*డిసెంబర్ 31: దుండగుల దాడిలో గాయపడిన వ్యాపారి ఖోఖన్ చంద్ర దాస్ చికిత్స పొందుతూ జనవరి 3న మృతి.

*జనవరి 5: గ్రోసరీ షాపు యజమాని మణి చక్రవర్తి దారుణ హత్య.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+