కరెన్సీ నోట్లలో జంతువుల కొవ్వు!.. ఆ నోట్లు వద్దంటున్న హిందు టెంపుల్

Subscribe to Oneindia Telugu

లండన్: ఐదు పౌండ్ల నోటులో జంతువు కొవ్వును ఉపయోగిస్తున్నారన్న కారణంగా.. లండన్ లోని శ్రీ సంతన్ మందిర్ అనే ప్రముఖ హిందూ దేవాలయం ఆ నోట్లను తిరస్కరిస్తున్నట్టుగా ప్రకటించింది. ఐదు పౌండ్ల నోటు తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగిస్తున్న మాట నిజమేనని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ప్రకటించిన మరునాడే ఆ దేవాలయం నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.

pound

ఇకనుంచి ఆలయంలో విరాళం కింద ఐదు పౌండ్ల నోటును తీసుకోబోమని ఆలయ అధ్యక్షుడు విభూతి ఆచార్య ప్రకటించారు. ఐదు పౌండ్ల నోటులో జంతువుల కొవ్వును ఉపయోగించడం పట్ల హిందువులు ఆగ్రహంగా ఉన్నారని, జంతుహింసకు దూరంగా ఉండే హిందువులు ఇలాంటి చర్యలు ఇష్టపడరని ఆయన పేర్కొన్నారు.

జంతువుల కొవ్వును ఉపయోగించి తయారుచేసిన 5పౌండ్ల నోట్లను బ్యాంకుల నుంచి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపాదించిన ఓ పిటిషన్ పై ఇప్పటికే 50వేల మంది సంతకం చేసినట్టుగా తెలుస్తోంది. కాగా, ఇంగ్లాండ్ లో హిందువుల సంఖ్య ఎక్కువగా ఉండే లీసెస్టర్‌లోనే శ్రీ సంతన్ మందిర్ దేవాలయముంది. దీపావళి వేడుకలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The notes are made from small amounts of tallow, derived from animal waste products, which has angered a number of groups who are against animal harm.
Please Wait while comments are loading...