సౌదీ అరేబియాలోని ఎయిర్ పోర్ట్ పై హౌతీ దాడులు.. హైదరాబాద్‌ వాసి మృతి

సౌదీ అరేబియా రాజధాని రియాద్ లోని ఎయిర్ పోర్ట్ పై జరిగిన క్షిపణి దాడిలో ఇప్పటి వరకూ 13 మంది మృతి చెందారు. మరో 300 మందికి గాయాలయ్యాయి. రియాద్ లోని కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పై శనివారం హౌతీ దళాలు క్షిపణి దాడి జరిపిన సంగతి తెలిసిందే. గాయపడిన 300 మందిలో పది మందికి పైగా భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఇక 13 మంది మృతుల్లో నలుగురు సౌదీ పౌరులు, ఇద్దరు బంగ్లాదేశీయులు, ఒక పాలస్తీనా పౌరుడు, ఒకరు అమెరికన్ సిటిజన్, ఓ ఈజిప్ట్ పౌరుడు, ఓ జోర్డాన్ పౌరుడు, అలాగే సిరియా నుంచి ఒకరు, సూడాన్ నుంచి ఒకరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే సౌదీ అరేబియాలోని భారత దౌత్య కార్యాలయం.. ఈ ఘటనలో ఓ భారతీయుడు మృతి చెందినట్లు ధ్రువీకరించింది. మృతుడి కుటుంబంతో టచ్ లో ఉన్నామని వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి పంపించే ఏర్పాట్లను ముమ్మరం చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.

"అక్టోబర్ 10న రియాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ క్షిపణి దాడికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ ప్రమాదంలో ఓ భారతీయుడు గాయపడిన విషయం తెలిసిందే. అయితే అతను దురదృష్టవశాత్తూ మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. మృతుడి కుటుంబంతో టచ్ లో ఉన్నాం. వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు కృషి చేస్తున్నాం" అని సౌదీలోని భారత దౌత్య కార్యాలయం ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది.

Houthi attack on Saudi Arabian airport Hyderabad resident yousuf killed Saudi Arabia airport attack

ఇక ఇదే ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రియాద్ ఎయిర్ పోర్టులో జరిగిన క్షిపణి దాడిలో ఓ భారతీయుడు మృతి చెందడం తనను కలిచివేసిందన్నారు. మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు అవసరమైన అన్నిరకాల సాయాన్ని సౌదీలోని భారత దౌత్య కార్యాలయం అందిస్తుందని అన్నారు. అయితే రియాద్ ఎయిర్ పోర్టులో జరిగిన దాడిలో మృతి చెందిన ఆ భారతీయుడు హైదరాబాద్ కు చెందిన మీర్ మహమ్మద్ యూసుఫ్ అలీ అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక ప్రకటన చేశారు. ఈ దాడిలో యూసుఫ్ ఇద్దరు కుమారులకు గాయాలు అయ్యాయని.. ఆయన భార్య, కుమార్తె సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు బాధిత కుటంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని విదేశాంగమంత్రి జై శంకర్ కు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+