పాకిస్థాన్ ను ఉక్కు పిడికిలితో నలిపేస్తాం: హౌతీ సంచలన వార్నింగ్

వెస్ట్ ఆసియాలో పరిస్థితులు అంతకంతకూ పెరుగుతున్నాయి. సౌదీ అరేబియాపై హౌతీ దళాలు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సౌదీ అరేబియా రియాద్ లోని కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలో హౌతీలు డ్రోన్ దాడులకు తెగబడ్డారు. దాంతో విమానాశ్రయం ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సౌదీ అధికారులు విమానాశ్రయం సేవలను రద్దు చేసింది. అయితే సౌదీ అరేబియాకు మద్దతుగా పాకిస్థాన్, టర్కీ దేశాలు జోక్యం చేసుకుంటున్నాయి. ఈ మేరకు సౌదీలో పాకిస్థాన్, టర్కీ దేశాలు తమ బలగాలను మోహరిస్తున్నాయి. అయితే ఈ చర్యలను హౌతీ దళాలు తీవ్రంగా తప్పుబట్టాయి. యుద్ధం మధ్యలో దూరితే పాకిస్థాన్, టర్కీ దేశాలపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చాయి. సౌదీ యుద్ధానికి ఆ దేశాలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని హెచ్చరించాయి.

ఈ మేరకు సీనియర్ హౌతీ అధికారి అల్- భుకైటీ తాజాగా సీఎన్ఎస్- న్యూస్ 18 కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌదీ అరేబియా- యెమెన్ యుద్ధంలో అడుగు పెడితే పాకిస్థాన్, టర్కీ దేశాలపై ప్రతీకార దాడులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రీమెంట్ ప్రకారం.. సౌదీ అరేబియాకు పాకిస్థాన్ సైన్యం మద్దతు ఇస్తుందని పాకిస్థాన్ డిఫెన్స్ అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో హౌతీ గ్రూప్ వార్నింగ్ బయటకు రావడం కీలకంగా మారింది. ఇక ఆగస్టు 2026 లో సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ మధ్య మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రీమెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం.. ఈ కూటమిలోని ఏ దేశం పైనా దాడులు జరిగినా మిగతా దేశాలపైనా జరిగినట్లుగా భావించి సైనిక సహకారం అందిస్తాయి.

Houthis issued warning to Pak Turkey in support of SaudiArabia threatening to crush with iron fist

ఇక సీఎన్ఎస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ హౌతీ అధికారి అల్- భుకైటీ మాట్లాడుతూ.. ఇస్లామాబాద్ కానీ అంకారా కానీ హౌతీలపై డైరెక్ట్ అటాక్ కు పాల్పడితే తక్షణమే ప్రతీకార దాడులు చేస్తామని తెలిపారు. సౌదీ అరేబియా- యెమెన్ యుద్ధంలో దూరితో తమ ఉక్కు పిడికిలితో పాకిస్థాన్, టర్కీ పై దాడులు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు పాకిస్థాన్, టర్కీలో గ్రౌండ్ రియాలిటీ వేరే విధంగా ఉన్నట్లు సీఎన్ఎన్ స్పష్టం చేసింది. పాకిస్థాన్ లోని అధిక శాతం జనాభా యెమెన్ పై మానవత్వంతో ఉన్నట్లు వివరించింది. ఈ మేరకు యెమెన్- సౌదీ అరేబియా యుద్ధం విషయంలో పాకిస్థాన్, టర్కీ న్యూట్రల్ గా ఉండాలని.. యుద్ధంలోకి ప్రవేశించొద్దని అక్కడి ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+