తక్కువ ఖర్చు చేశాను: యుఎస్ లో నేనే టాప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన తాను తక్కువ ఖర్చు పెట్టినా ప్రజాదరణలో తొలి స్థానంలో ఉన్నట్లు రిపబ్లిక్ పార్టీ తరపున రేసులో ముందున్న డోనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఇప్పటి వరకు తాను ఎన్నికల ప్రచారం కోసం చాలా తక్కువ డబ్బు ఖర్చు పెట్టానని అంటున్నారు.

వచ్చే వారం నుంచి ఏడు రోజులకు గాను రెండు మిలియన్ డాలర్లు (భారత్ కరెన్సీలో రూ. 13.27 కోట్లు) ప్రకటనల కోసం ఖర్చు పెడుతున్నానని డోనాల్డ్ ట్రంప్ వివరించారు. మంగళవారం ఆయన వాషింగ్టన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

తనకు యూఎస్ లో 40 శాతం ప్రజాదరణ ఉందని, తర్వాతి స్థానంలో ఉన్న అభ్యర్థికి కేవలం 13 శాతం మాత్రమే మద్దతు ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఖర్చు పెట్టడానికి సిద్దంగా ఉన్నానని డోనాల్డ్ ట్రంప్ అన్నారు.

How Donald Trump destroyed the Republican Party in US

సరిహద్దు భద్రత, వ్యాపారం, ఐఎస్ఐఎస్ నుంచి రక్షణ లాంటి అంశాలకు తాను ఈ డబ్బు ఖర్చు పెట్టేందుకు సిద్దంగా ఉన్నానని వివరించారు. ట్వీట్టర్ ఖాతాలో మరిన్ని విషయాలను డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.

తన ప్రత్యర్థి జెబ్ బుష్ ఎన్నికల ఖర్చు కోసం ఇప్పటికే రూ. 391 కోట్లు ఖర్చు పెట్టారని, ఎవ్వరూ ఆయనను ఆదరించలేదని ట్రంప్ గుర్తు చేశారు. అయితే తన ప్రత్యర్థులతో పోల్చుకుంటే తాను పెట్టిన ఖర్చు చాలా తక్కువ అని అన్నారు.

వచ్చే వారం నుంచి ఒక్క వారానికి రెండు మిలియన్ల డాలర్లు ప్రకటనల కోసం తాను ఖర్చు చేస్తానని, అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం తాను మొత్తంగా రూ. 232 కోట్లు ఖర్చు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నానని డోనాల్డ్ ట్రంప్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+