ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..!
ఇరాన్ (Iran)పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టి వారం రోజులవుతోంది. అయినా ఇరాన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఓవైపు ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు చేస్తున్నా తొణకకుండా వీరితో పాటు గల్ఫ్ దేశాలపైనా వరుస ప్రతిదాడులు చేస్తోంది. అలాగే ఆయుధ సామాగ్రి విషయంలోనూ ఇరాన్ వద్ద ఎలాంటి కొరత ఉన్నట్లు కనిపించడం లేదు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ వద్ద ఆయుధ సామాగ్రి నిండుకుంటున్నట్లు నివేదికలు వస్తున్నాయి. దీని వెనుక ఉన్న సీక్రెట్ పైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఇరాన్ సీక్రెట్ అస్త్రం (iran)
వాస్తవానికి అమెరికా గతంలో ఇరాన్ పై విధించిన ఆంక్షలకు ఆ దేశం పూర్తిగా కుదేలైపోవాలి. ఒకటి రెండు రోజుల యుద్దం కూడా ఎదుర్కొనే పరిస్ధితి ఉండకూడదు. కానీ ఇప్పుడు ఆ దేశం చేస్తున్న దాడులు చూస్తుంటే దీని వెనుక ఏదో ఒక సీక్రెట్ ఉందని అర్థమవుతోంది. అదే బిట్‌కాయిన్ మైనింగ్ (bitcoin mining). 2019లో దీనిని అంతర్జాతీయంగా చట్టబద్దం చేశారు. అదే ఇప్పుడు అగ్రరాజ్యాల ఆంక్షలను ఎదుర్కొనే వ్యూహాత్మక చెల్లింపుల నెట్‌వర్క్‌గా మారింది అంటున్నారు. దీని కింద బిట్ కాయిన్ పజిల్స్ ను పరిష్కరిస్తే బిట్ కాయిన్స్ లభిస్తాయి. ఇప్పుడు ఒక్కో బిట్ కాయిన్ బ్లాక్ విలువ 3.125 బిట్ కాయిన్లుగా ఉంది.

బిట్ కాయిన్ మైనింగ్
ఇరాన్ కరెన్సీ పతనం, ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆంక్షల కింద నలుగుతున్నా, టెహ్రాన్ విదేశాల నుంచి యంత్రాలు, ఇంధనం, సైనిక విడిభాగాలను కొనుగోలు చేస్తుంది. బిట్‌కాయిన్ మైన్ చేసి, ఖర్చు చేయడమే ఈ వ్యూహం. ఇరాన్ బిట్‌కాయిన్‌ను సుమారు $1,300కు మైన్ చేస్తుంది. అది $73,000 డాలర్లకు ట్రేడవుతున్నందున, ప్రతి కాయిన్‌కు $71,700 లాభం. దీన్ని ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ వెలుపల వాడవచ్చు. ఈ వ్యూహం అమెరికా రెండు దశాబ్దాలుగా నిర్మించిన ఆంక్షల వ్యవస్థలో లొసుగును సృష్టిస్తుంది. దీనిలో తక్షణ బదిలీలు, కరస్పాండెంట్ బ్యాంకులు, అమెరికా ట్రెజరీ నియంత్రణ అవసరం లేదు.

ఇప్పుడిప్పుడే అర్దమవుతోందా ?
ఎన్ని ఆంక్షలున్నా ఇరాన్ క్రిప్టో ఎకోసిస్టమ్ 2025లో $7.78 బిలియన్లకు విస్తరించింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తో అనుసంధానమైన అడ్రస్ లు క్రిప్టో నెట్ వర్క్ ల ోసగానికి పైగా ఉండి ఉంటూ $3 బిలియన్లకు పైగా లావాదేవీలు జరిపాయి. ప్రతి బిట్‌కాయిన్ లావాదేవీ బ్లాక్‌చెయిన్‌లో శాశ్వతంగా నమోదవుతుంది. ఫిబ్రవరి 28–మార్చి 2 మధ్య $10.3 మిలియన్లు ఎక్స్ఛేంజ్ నుండి బయటికి వెళ్లాయి. అప్పుడు గంటవారీ లావాదేవీలు 2026 సగటు కంటే 873% పెరిగాయి. నిఘా ఏజెన్సీలు ఈ సామర్థ్యాన్ని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాయి.
-
ఇరాన్ యుద్ధంలో ఓడిపోతోంది ఎవరు ? తెరవెనుక ఏం జరుగుతోంది ? -
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
ట్రంప్ దెబ్బకు తలవంచిన ఇరాన్..? ఎట్టకేలకు కాళ్లబేరానికి..? -
ఇజ్రాయెల్ భీకర ప్రతీకారం: హిజ్బుల్లా మాస్టర్‌మైండ్ హతం! -
ఇరాన్ వార్ లోకి రెండు గల్ఫ్ దేశాలు? ట్రంప్ వైఫల్యం వేళ బిగ్ ట్విస్ట్..! -
సైలెంట్ కిల్లర్స్: ఇరాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ఇజ్రాయెల్ 'యూనిట్ 8200'!! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్ సంస్థల్ని బూడిద చేస్తాం: అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
పాకిస్థాన్ గాలి తీసిన ఇరాన్.. ఎగిరెగిరిపడిన ఆ దేశానికి సడెన్ షాక్.. -
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
ఇరాన్ తో డీల్ లేనట్లేనా ? సర్వనాశనమే- ట్రంప్ ఫైనల్ వార్నింగ్..! -
ఇరాన్ లో మా టార్గెట్ అదే..! అసలు ప్లాన్ బయటపెట్టిన ట్రంప్..!











Click it and Unblock the Notifications