ఉ.కొరియా వల్లే: ఢీలా పడ్డ దేశీ, అంతర్జాతీయ మార్కెట్లు..
స్టాక్స్ అన్ని ఒక్కసారిగా ఉపసంహరించుకోవడంతో మార్కెట్లు ఢీలా పడుతున్నాయి.
ముంబై: ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబు హెచ్చరికలతో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ ప్రభావం దేశీ మార్కెట్లపై కూడా పడింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగే సూచనల నేపథ్యంలో.. మదుపర్లు లాభాల స్వీకరణకే మొగ్గుచూపుతున్నారు. స్టాక్స్ అన్ని ఒక్కసారిగా ఉపసంహరించుకోవడంతో మార్కెట్లు ఢీలా పడుతున్నాయి.

దేశీ మార్కెట్ సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 9,950 దిగువకు పడిపోయింది. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలే ఈ పతనానికి కారణమంటున్నారు. ఆరంభ ట్రేడింగ్ నుంచే సెన్సెక్స్ నష్టాల బాట పట్టింది. ప్రస్తుతం సెన్సెక్స్ 161 పాయింట్లు నష్టపోయి 31,731 వద్ద, నిఫ్టీ 56 పాయింట్ల నష్టంతో 9,918 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కాగా, డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.03గా కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications