వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో రెస్ట్ ఇన్ పీస్...! మరణం తర్వాత మానవ శరీరంలో కదలికలు..?

|
Google Oneindia TeluguNews

మనిషి చనిపోయిన తర్వాత మృత దేహం ఎక్కడైన కదులుతుందా.. అంటే లేదు, అనే సమాధానం అందరి నుండి వస్తుంది. అసలు చనిపోయిన మనిషి కదులుతాడేనే పిచ్చి ప్రశ్నలేమిటీ అనే సందేహాలు కూడ కొంతమందికి రావచ్చు. కాని అందరి అభిప్రాయాలకు విభిన్నంగా అస్ట్రేలియాకు చెందిన సీక్యూ యూనివర్శిటికి చెందిన పరిశోధకురాలు మాత్రం అవును చెబుతోంది. మనిషి చనిపోయిన తర్వాత ఒకటి కాదు రెండు ఏకంగా 17 నెలల పాటు శరీరం కదులుతూ ఉంటుందని నిరూపించారు.

 మనిషి మరణం తర్వాత కదలికలు

మనిషి మరణం తర్వాత కదలికలు

మనిషి మరణం తర్వాత చాల మంది తమ సంతాపాన్ని తెలుపుతూ రెస్ట్ ఇన్ పీస్ అంటూ తెలుపుతున్న విషయం తెలిసిందే.. కాని చనిపోయిన మనిషి రెస్ట్ లేకుండా కదులుతూ ఉంటాడంటూ పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇలా ఏకంగా మనిషి మరణం 17నెలల పాటు మృతదేహం కదలికలు ఉంటాయని చెబుతున్నారు. ఈనేపధ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకురాలైన ఎలిసోన్ విల్సన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఆస్ట్రేలియా కేంద్రంలో పరిశోధన

ఆస్ట్రేలియా కేంద్రంలో పరిశోధన

ఆస్ట్రేలియాలో నగరానికి దూరంలోని ఓ అటవీ ప్రాంతంలో ఫెసిలిటి ఫర్ టఫోనోమిక్స్ ఎక్స్‌పరిమెంట్స్ రిసెర్చ్ సెంటర్‌ అనే సెంటర్ ఉంది. దీంట్లో పోస్టుమార్టం,సంబంధిత అధ్యయనాలు,పరిశోధనలు ఈ కేంద్రంలో జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే మనిషి మృతదేహం కదలికలకు సంబంధించి ఈ కేంద్రంలో నే పరిశోధనలు జరిగాయి. పరిశోధనల్లో భాగంగా సుమారు 70 శవాల్లో ఒకదాన్ని ఎంపిక చేసి పరిశోధనలు జరిపినట్టు విల్సన్ అనే పరిశోధకురాలు తెలిపింది.
పరిశోధనల్లో భాగంగా ఇద్దరు అసిస్టేంట్స్‌తో కలిసి మృతదేహంలోని కదలికలు గుర్తించి రికార్డ్ చేసినట్టు ఆమే తెలిపారు. ఇందుకు సంబంధించి ఫోటోలను కూడ తీసినట్టు ఆమే చెప్పారు.

చిన్నప్పటి నుండే మరణాలపై ఆసక్తి

చిన్నప్పటి నుండే మరణాలపై ఆసక్తి

కాగా విల్సన్ మనిషి మరణం తర్వాత ఎమవుతాడనే అలోచనలు చిన్నప్పటి నుండి ఉండేవని ఇందులో భాగంగానే ఈ పరిశోధనలపై దృష్టి సారించానని తెలిపారు. గతంలో కూడ మృతదేహం కదలికలను గమనించిన ఆమే ఈ పరిశోధనలు చేసినట్టు తెలిపింది.చిన్నప్పుడు పశువులు చనిపోయినప్పుడు కూడ వాటిని క్షుణ్ణంగా పరిశీంచేదని తెలిపింది. కాగా ఆమే ఇలాంటీ వాటిపై చేసిన పరిశోధనలు, కనుగొన్న విషయాలు "ఫోరెన్సిక్ సైన్స్ ఇంటర్నేషనల్: సినర్జీ" అనే పత్రికలో ప్రచురించబడ్డాయి.

English summary
An Australian scientist has proved that human bodies move around significantly for more than a year after death, in findings that could have implications for detectives and pathologists around the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X