Afghanistan: ఆఫ్గన్ అస్తవ్యస్తం-వేతనాల కోసం వందలాది మంది నిరసనలు-వాటిని అప్పగించాలని తాలిబన్ల ఆదేశాలు
ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల వశమయ్యాక అక్కడి ప్రభుత్వ,ప్రైవేట్ వ్యవస్థలన్నీ దాదాపుగా స్తంభించిపోయాయి. తాలిబన్లు ఇంకా తమ పాలసీని ప్రకటించకపోవడంతో ప్రస్తుతం అక్కడ ఏ కార్యకలాపాలు ముందుకు సాగట్లేదు. ఇప్పటికే కరెన్సీ విలువ భారీగా పతనమైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే... రానున్న రోజుల్లో ఆఫ్గన్‌లో ఆకలి కేకలు,దోపిడీలు,నేరాలు,తాలిబన్ల అరాచకాలు తీవ్రమయ్యే అవకాశం ఉంది.
ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ,సెంట్రల్ బ్యాంకు అధ్యక్షుడు ఇప్పటికే దేశం విడిచి పారిపోయారు. దీంతో వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమయ్యాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ

వేతనాల కోసం ఉద్యోగుల నిరసన
గత ఆర్నెళ్లుగా ప్రభుత్వం తమకు వేతనాలు చెల్లించలేదని... వెంటనే తమ వేతనాలు చెల్లించాలని నిరసనకు దిగిన ఉద్యోగులు డిమాండ్ చేశారు. మూడు రోజుల క్రితం బ్యాంకులు తెరిచినప్పటికీ... మనీ విత్ డ్రాను కేవలం 200డాలర్లకు పరిమితం చేశారని వారు వాపోయారు. ఏటీఎం మెషీన్ల వద్ద వారు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఆఫ్గన్‌లో ఇదే సంక్షోభం,కరువు కొనసాగితే... లక్షలాది మందికి మానవతా సాయం అవసరం అవుతుందని ఏ.యు.ఎన్ ఏజెన్సీ హెచ్చరించింది. మరోవైపు తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా కీలక ప్రకటన చేశారు.'కాబూల్‌లో ఎవరెవరైతే ప్రభుత్వ వాహనాలు,ఆయుధాలు,ఇతరత్రా పరికరాలు,వస్తువులు వాడుతున్నారో... వాటన్నింటినీ తమకు అప్పగించాలి. వారం రోజుల్లోగా వాటిని ఇస్లామిక్ ఎమిరేట్ ప్రభుత్వంలోని సంబంధిత శాఖలకు చేరవేయాలి.' అని తెలిపారు.
కాబూల్ విమానాశ్రయం వద్ద కాల్పులు...
ఇప్పటికే ఆత్మాహుతి దాడితో కాబూల్ విమానాశ్రయం వద్ద దాదాపు 200 మంది మృతి చెందగా... తాజాగా మరోసారి అక్కడ కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కమాండర్ ఆచార్య ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మూడు గంటల క్రితం కాబూల్‌లో భారీ ఎత్తున కాల్పులు చోటు చేసుకున్నాయని... ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం కాబూల్ విమానాశ్రయం నుంచి ఆయా దేశాల పౌరుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆగస్టు 31 వరకు డెడ్ లైన్ ఉన్నప్పటికీ... ఆలోపే ప్రక్రియను పూర్తి చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. గడువును పొడగించాలని బ్రిటన్ తదితర దేశాలు కోరినప్పటికీ అమెరికా అందుకు అంగీకరించలేదు. ఇప్పటికే ఓసారి ఆత్మాహుతి దాడితో 13 మంది నేవీ సైనికులను అమెరికా కోల్పోయింది. దీంతో మరింత ప్రమాదం ముందుకు రాకముందే అమెరికన్ పౌరులను,సైనిక బలగాలను అక్కడి నుంచి తరలించాలని భావిస్తోంది.
Recommended Video

అమెరికా ప్రతీకార దాడులు
ఆత్మాహుతి దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు శనివారం(ఆగస్టు 28) అమెరికా ఆఫ్గన్‌లో వైమానిక దాడులకు దిగింది. ఆఫ్గన్-పాకిస్తాన్ సరిహద్దులోని నంగహర్ ప్రావిన్స్‌లోని ఐసిస్ స్థావరాలపై దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఐసిస్ ఉగ్రవాది ఒకరు హతమయ్యారు. సాధారణ పౌరులెవరూ ఈ దాడుల్లో మరణించలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ బిల్ వెల్లడించారు.వైమానిక దాడుల్లో హతమైన ఉగ్రవాది కాబూల్ పేలుళ్ల సూత్రధారిగా తెలుస్తోంది. కాబూల్ విమానాశ్రయంపై దాడి జరిగిన 48 గంటల్లోనే అమెరికా వైమానిక దాడులకు దిగడం గమనార్హం. పేలుళ్లకు బాధ్యులైన ఐసిస్‌ను వదిలిపెట్టేది లేదని... వేటాడి,వెంటాడి హతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బైడెన్ ఆదేశాల మేరకు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ వైమానిక దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications