వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వందల కోట్ల విలువ చేసే క్రిప్టో కరెన్సీ ‘గుప్తనిధులు’.. వెతికి పట్టుకుంటున్న హ్యాకర్లు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

కూతురు మేగాన్ కాంపర్ట్‌తో రోండా
Click here to see the BBC interactive

రోండా కాంపెర్ట్ బిట్‌కాయిన్లు వచ్చిన కొత్తల్లో వాటిని కొనడం మొదలుపెట్టారు.

2013లో ఒక బిట్ కాయిన్ విలువ 80 డాలర్లు(రూ.6 వేలు) ఉన్నప్పుడు ఆమె ఆరు బిట్‌కాయిన్లు కొనుగోలు చేశారు.

"నేనొక రేడియో షో వినేదాన్ని, అందులో వాళ్లు క్రిప్టో, బిట్‌కాయిన్ గురించి మాట్లాడుతుండేవారు. దాంతో నాకు వాటిపై ఆసక్తి పుట్టింది. అయితే, అప్పట్లో బిట్‌కాయిన్లు కొనడం అంత సులభం కాదు. అయినా, ఎలాగోలా తంటాలు పడి నేను వాటిని కొన్నాను" అన్నారు.

రోండా అమెరికాలోని ఇలినాయిస్ రాష్ట్రంలో ఉంటారు. తర్వాత కూడా ఆమె కొన్ని బిట్‌కాయిన్లు కొనుగోలు చేశారు. ఆ తర్వాత వాటి గురించి మర్చిపోయారు.

కానీ, 2017లో ఒక బిట్‌కాయిన్ విలువ 13 వేల డాలర్లకు(రూ.97 వేలు) పెరిగిందని పేపర్లలో హెడ్‌లైన్స్ చూడగానే ఆమె అదిరిపడ్డారు. వెంటనే కంప్యూటర్‌లో లాగిన్ అయ్యి, తన కాయిన్స్ విలువ ఎంతయ్యిందో చూడాలనుకున్నారు.

అయితే, తన బిట్‌కాయిన్ వాలెట్‌ లాగిన్ వివరాలు సరిగా గుర్తుకురాకపోవడంతో ఆమె దాన్ని ఓపెన్ చేయలేకపోయారు.

బిట్ కాయిన్ వాలెట్ అంటే.. కొన్ని రహస్య అంకెలు లేదా ప్రైవేట్ కీస్‌ను స్టోర్ చేసే ఒక కంప్యూటర్ ప్రోగ్రాం లేదా డివైస్‌లా ఉంటుంది.

"నేను తీసిన ప్రింటవుట్‌లో నా వాలెట్ ఐడెంటిఫైర్ చివర్లో కొన్ని అంకెలు మిస్సయినట్టు నాకు అప్పుడే తెలిసింది. నా పాస్‌వర్డ్ కూడా ఒక పేపరుపైన రాసిపెట్టుకున్నా. కానీ, నా వాలెట్ ఐడీ ఏంటో గుర్తురాలేదు. చాలా బాధేసింది. కొన్ని నెలలవరకూ చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేశా. కానీ, లాభం లేకపోవడంతో, ఒకవిధంగా వాటిపై ఆశ వదులుకున్నా" అన్నారు రోండా.

క్రిస్, చార్లీ బ్రూక్స్

క్రిప్టో నిధిని వెంటాడే వేటగాళ్లు

కట్ చేస్తే, గత ఏడాది మార్చిలో బిట్‌కాయిన్ ధర 50 వేల డాలర్ల(రూ.37 లక్షలకు పైనే)కు పైగా పెరిగింది. అంటే, 8 ఏళ్ల క్రితం రోడా మొదట దానిని కొనుగోలు చేసిన ధరతో పోలిస్తే 600 రెట్లు పెరిగింది.

దీంతో, ఆమె ఎలాగైనా సరే తన బిట్‌కాయిన్లను వెతికిపట్టుకోవాలనుకున్నారు. తనకు ఎవరైనా సాయం చేయగలరా అని ఇంటర్నెట్ అంతా గాలించారు. అప్పుడే ఆమె క్రిప్టో కరెన్సీని వెతికిపెట్టే వేటగాళ్లైన తండ్రీకొడుకులు క్రిస్, చార్లీ బ్రూక్స్ వివరాలు దొరికాయి.

"ఆన్‌లైన్లో కాసేపు వాళ్లతో మాట్లాడక, నాకు వాళ్లపై నమ్మకం కలగడంతో, నా వాలెట్ గురించి నాకు గుర్తున్న వివరాలన్నీ వాళ్లకిచ్చి, కొన్నిరోజులు వెయిట్ చేశాను. చివరికి ఒక వీడియో కాల్‌ ద్వారా మేమంతా కలిశాం. అక్కడ జరుగుతున్నదంతా నాకు కనిపిస్తోంది. క్రిస్ నా వాలెట్ ఓపెన్ చేశారు. అక్కడ నా కాయిన్స్ ఉండడంతో నాకు గుండెలమీద నుంచి ఒక పెద్ద బరువు దింపినట్టయ్యింది" అన్నారు.

ఆ సమయంలో రోండా వాలెట్లోని మూడున్నర బిట్ కాయిన్ల విలువ లక్షా 75 వేల డాలర్లు(రూ.1 కోటీ 30 లక్షలకు పైనే).

"వాళ్లతో చేసుకున్న డీల్ ప్రకారం క్రిస్, చార్లీకి నేను ఆ మొత్తంలో 20 శాతం వాటా ఇచ్చాను. తర్వాత నేను మొదట చేసిన పని... అందులో 10 వేల డాలర్ల విలువ చేసే కాయిన్స్ తీసి నా కూతురు మేగాన్ కాలేజీ ఫీజు కట్టడం" అని రోండా చెప్పారు.

మిగతా మొత్తాన్ని ఆ హార్ట్‌వేర్ వాలెట్‌లోనే ఉంచేశానని ఆమె చెప్పారు.

హార్డ్ వేర్ వాలెట్ అంటే యూఎస్‌బీ స్టిక్‌లా ఉండే ఒక సెక్యూరిటీ డివైస్. ఆమె వివరాలను అది ఆఫ్‌లైన్లో స్టోర్ చేస్తుంది. ఈసారీ తన కొత్త హార్డ్‌వేర్ లాగిన్ పిన్‌ను ఆమె బాగా గుర్తు పెట్టుకున్నారు.

ప్రస్తుతం 43 వేల డాలర్లు(రూ.3 లక్షల 20 వేలు) ఉన్న తన ఒక్కో బిట్ కాయిన్ విలువ మళ్లీ పెరుగుతుందని రోండా ఆశగా ఎదురుచూస్తున్నారు.

క్రిప్టో కరెన్సీ, స్టాక్స్‌లో డే ట్రేడర్‌గా చేస్తున్న తన ఉద్యోగాన్ని వదిలేయాలనుకున్నప్పుడు, ఈ మొత్తం తనకు ఒక రిటైర్మెంట్ ఫండ్‌లా ఉండిపోతుందని ఆమె అంటున్నారు.

బిట్ కాయిన్

వందల కోట్లు పోగొట్టుకున్నారు

రోండా లాగే బిట్‌కాయిన్లు కొనుగోలు చేసి, తర్వాత వాటిని పోగొట్టుకున్న ఎంతోమంది ఇప్పుడు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం చెలామణిలో ఉన్న మొత్తం కోటీ 89 లక్షల బిట్‌కాయిన్లలో 37 లక్షలకు పైగా యజమానుల నుంచి దొంగతనానికి గురయ్యాయని క్రిప్టో పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

క్రిప్టోకరెన్సీ ప్రపంచంలో ఇలాంటివి జరిగినపుడు, దానికి ఎవరైనా బాధ్యత వహించడం అనేది ఉండదు. అందుకే, మనం ఒకసారి మన వాలెట్ వివరాలు పోగొట్టుకుంటే ఇక దాని గురించి ఎవరినీ పెద్దగా అడగడం అంటూ ఉండదు.

యజమానులు ఇచ్చే గజిబిజి వివరాల నుంచి సరైన లాగిన్ వివరాలను రాబట్టడానికి తమలాగే కంప్యూటర్లతో కుస్తీ పడుతున్నవారు... ఇప్పటివరకూ వారు పోగొట్టుకున్న మొత్తంలో దాదాపు 390 కోట్ల డాలర్ల(రూ.2 లక్షలా 91 వేల కోట్లకు పైనే) విలువైన 2.5 శాతం బిట్‌కాయిన్లను రికవరీ చేయవచ్చని క్రిస్, చార్లీ చెబుతున్నారు.

క్రిస్ తన క్రిప్టో అసెట్ రికవరీ వ్యాపారాన్ని 2017లో ప్రారంభించారు. కానీ, తర్వాత కొన్నేళ్లపాటు ఆయన వేరే ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. కొడుకుతో ఒకసారి మాటల్లో రికవరీ విషయం రావడంతో, పోగొట్టుకున్న బిట్‌కాయిన్ల కోసం మళ్లీ వేట మొదలెట్టాలని నిర్ణయిచుకున్నారు.

"అప్పుడు నేను కాలేజీ నుంచి బ్రేక్ తీసుకుని ఉన్నా. ఇంట్లో నాన్నతో వర్క్‌షాప్ బిజినెస్ ఐడియాల గురించి మాట్లాడుతున్నా. అప్పుడే, మా బిజినెస్ మళ్లీ మొదలెట్టాలనే ఆలోచన వచ్చింది. తర్వాత మేం ఇంటికి సర్వర్లు తీసుకొచ్చాం. మళ్లీ మొత్తం మొదలుపెట్టాం" అని 20 ఏళ్ల చార్లీ చెప్పారు.

ఈ తండ్రీకొడుకులు న్యూహాంప్‌షైర్‌లో సముద్ర తీరంలోని తమ ఇంట్లో వర్క్‌షాపులో పనిచేస్తూనే, బిట్‌కాయిన్లు పోగొట్టుకున్న కస్టమర్ల నుంచి రోజుకు వందకు పైగా ఈమెయిళ్లు అందుకునేవారు. 2021లో వాటి సంఖ్య మరింత పెరిగింది.

ఇప్పుడు మెయిళ్ల సంఖ్య తగ్గినా, తండ్రీకొడుకుల పని మాత్రం కొనసాగుతూనే ఉంది. వారి దగ్గర రికవరీ చేయాల్సిన కేసులు ఇంకా చాలా ఉన్నాయి. ఈ వ్యాపారం జోరుగా సాగుతుండడంతో చార్లీకి తన కంప్యూటర్ సైన్స్ డిగ్రీని పూర్తి చేసే ఉద్దేశం కూడా కనిపించడం లేదు.

అయితే, తాము దీనికి పెడుతున్న సమయంలో ఎక్కువభాగం నిరుత్సాహంతోనే గడిచిపోతుందని ఈ తండ్రీకొడుకులు చెబుతున్నారు.

తాము పక్కా లాగిన్ వివరాలు తెలుసుకోడానికి క్లైంట్స్ ఇచ్చే అరకొర వివరాలు, పేపర్లపై వారు రాసిన గజిబిజి రాతలు లేదా అంతుపట్టని ఆధారాలను వెతుకుతామని, దానికి పట్టే సమయంలో 30 శాతం మాత్రమే విజయవంతం అవుతామని వారు చెబుతున్నారు. అంత కష్టపడి, ఆ వాలెట్ల లోపలున్నది చూశాక ఈ తండ్రీకొడుకులు తరచూ నీరుగారిపోతుంటారు.

"చాలాసార్లు మనకు ఆ వాలెట్లలో ఎంత మొత్తం ఉంటుంది అనేది తెలీదు. దాంతో అక్కడ మా కష్టానికి తగిన ఫలితం ఉంటుందిలే అనుకుని క్లైంటునే నమ్ముకుంటాం. వేసవిలో మాకు ఒక కేస్ వచ్చింది. ఆయన తన దగ్గర 12 బిట్‌కాయిన్స్ ఉన్నాయన్నారు. దాంతో మేం చాలా ప్రొఫెషనల్‌గా ఆయనతో మాట్లాడినా, లోలోపల మనకు చాలా మొత్తం వస్తుందని సంతోషపడిపోయాం. క్లైంట్ లాగిన్ వివరాల కోసం దాదాపు పది గంటలు కష్టపడ్డమే కాదు, కంప్యూటర్ సర్వర్ మీద దాదాపు 60 గంటలు పనిచేశాం. తర్వాత, ఆయనకు వీడియో కాల్ చేసి చూపిస్తూ.. దాన్ని ఓపెన్ చేశాం. అది పూర్తిగా ఖాళీగా ఉంది" అన్నారు చార్లీ.

ఇప్పటివరకూ ఒక్క క్లైంట్ మాత్రమే తన వాలెట్లో ఉన్న మొత్తం గురించి తక్కువ అంచనా వేసినట్లు క్రిస్, చార్లీ చెప్పారు. ఆయన వాలెట్ నుంచి రికవరీ చేసిన 2,80,000 డాలర్ల(రూ.2 కోట్లు) విలువ చేసే బిట్‌కాయిన్లు ఇప్పటివరకూ తమ అతిపెద్ద వేటని తెలిపారు.

తమ సాయంతో రికవరీ అయిన మొత్తం బిట్ కాయిన్ల విలువ గత ఏడాది ఏడు అంకెల(కోట్ల డాలర్లు)కు చేరిందని (సరిగ్గా ఆ అంకె ఎంతో వారు చెప్పలేదు) ఈ తండ్రీకొడుకులు చెప్పారు.

2 మిలియన్ డాలర్ల విలువ చేసే క్రిప్టో కరెన్సీతో లాక్ అయిన క్రిప్టో వాలెట్‌ను క్రాక్ చేసిన తర్వాత క్లైంట్‌తో జో గ్రాండ్

హార్డ్‌వేర్ క్రాక్ చేయడం

పోగొట్టుకున్న క్రిప్టో కరెన్సీని వెతికిపెట్టడానికి తమ నైపుణ్యంతో జనాలకు సాయం చేసే ఎథికల్ హ్యాకర్స్ పరిశ్రమ జోరుగా పెరుగుతోంది. ఈ తండ్రీకొడుకులు అందులో ఒక భాగం మాత్రమే.

ఇలా క్రిప్టో కరెన్సీ రికవరీ కోసం సాయం చేసే మరొకరు జో గ్రాండ్. ఆయన టీనేజీలోనే హ్యాకింగ్ మొదలుపెట్టారు.

కింగ్‌పిన్ అనే తన ఇంటర్నెట్ హ్యాండిల్ ద్వారా మొదట్లో ఇంటర్నెట్‌ వచ్చినపుడు, దానిలోని బలహీనతల గురించి 1998లో అమెరికా సెనేట్ ముందు చూపించిన ఆయన గురించి హ్యాకింగ్ సమాజంలో అందరికీ తెలుసు.

2 మిలియన్ డాలర్ల(రూ.14 కోట్లు) విలువ చేసే థెటా అనే క్రిప్టోకరెన్సీ ఉన్న హార్డ్‌వేర్‌ వాలెట్‌ను ఎలా ఓపెన్ చేశానో చూపిస్తూ ఆయన ఇటీవల విడుదల చేసిన ఒక యూట్యూబ్ వీడియో జోరుగా వైరల్ అయ్యింది.

పోర్ట్‌లాండ్‌లోని తన వర్క్‌షాప్‌లో ఒక పద్ధతిని గుర్తించేముందు వేరేవారి హార్డ్‌వేర్ వాలెట్లు హ్యాక్ చేయాలో ప్రాక్టీస్ చేయడానికి జోకు ఎన్నో నెలలు పట్టింది.

హార్డ్‌వేర్ వాలెట్‌లో తను అంతకు ముందు గుర్తించిన రెండు బలహీనతలను కలిపి ఆయన చివరికి విజయం సాధించగలిగారు. అప్పుడప్పుడూ జాగ్రత్తగా ఎలక్ట్రిక్ షాకులు ఇవ్వడం ద్వారా అవి గందరగోళానికి గురై పిన్ కోడ్ ఇచ్చేస్తాయనే విషయం తెలుసుకున్నారు.

క్రిప్టో హార్డ్‌వేర్ లోపల దృశ్యం

"మనం ఒక క్రిప్టో వాలెట్ బ్రేక్ చేసినప్పుడు, అంటే… ఒక సెక్యూరిటీని బ్రేక్ చేసినప్పుడు అంతకు ముందు దానికోసం మనం ఎంత కష్టపడినా, అదొక మాజిక్‌లా అనిపిస్తుంది."

"ఈ వాలెట్‌ను హ్యాక్ చేయగలను అని నేను నా పరీక్షల్లో ఎన్నోసార్లు నిరూపించినప్పటికీ, ఆ రోజు నాకు కంగారుగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు, మనకు ఒకే ఒక ప్రయత్నం ఉంటుంది. లేదంటే అది మొత్తం బ్రేక్ అయిపోతుంది. కాయిన్స్ శాశ్వతంగా చేజారిపోతాయి."

"వాలెట్‌ను క్రాక్ చేసి ఓపెన్ చేస్తున్నప్పుడు నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. చెప్పాలంటే దాన్ని 'నిధుల వేట'కు టెక్నికల్ వర్షన్‌గా చెప్పచ్చు" అంటారు జో.

ఆయన హ్యాకర్ల నుంచి తమ ఉత్పత్తులను ఎలా సురక్షితంగా చేసుకోవాలో తయారీదారులకు సూచించే ఉద్యోగం చేస్తున్నారు.

కానీ, పోగొట్టుకున్న తమ క్రిప్టో కరెన్సీని రికవరీ చేయాలని, ఇప్పుడు చాలా మంది నుంచి తనకు కాల్స్ వస్తున్నాయని ఆయన చెప్పారు.

"అక్కడ నేను సమయం పెట్టడానికి తగినంత పెద్ద వాలెట్స్, అంత నిధి ఉన్నప్పుడు మాత్రమే, వాటిని ఓపెన్ చేయడానికి ప్రయత్నించాలని అనుకుంటాను" అంటారాయన.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Hundreds of crores worth of cryptocurrency 'secret funds' hackers looking for
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X