వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దోచుకు తినండి: సైనికులకు కిమ్ ఆదేశం, పెనుముప్పే!, సంతకాలకు సిద్దమవాలన్న పుతిన్..

ఉత్తరకొరియా సైనికులకు అక్కడి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. సైనికులు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు ప్రచారం జరుగుతుండటంతో.. తిండి విషయంలో వారికి పూర్తి స్వేచ్చనిచ్చింది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

North Korean Soldiers Ordered to steal cornఅగ్రదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఉత్తరకొరియా

పారిస్/ప్యోంగ్‌యాంగ్: అగ్రదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఉత్తరకొరియా.. ఇకముందు కూడా తన వైఖరిని మార్చుకోబోనని స్పష్టంగా చెబుతూనే ఉంది. దీంతో ఉత్తరకొరియా పొరుగుదేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికా, రష్యా, ఇతర దేశాల్లోను తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

రహస్యంగా అక్కడికెళ్లిన కిమ్: ఐరాస నివేదికలో షాకింగ్ నిజాలు, అమెరికాకు దడ..రహస్యంగా అక్కడికెళ్లిన కిమ్: ఐరాస నివేదికలో షాకింగ్ నిజాలు, అమెరికాకు దడ..

ఉత్తరకొరియాతో గండమే?: ముక్కలు చేస్తామని హెచ్చరిక.. పుతిన్ ఇలా!ఉత్తరకొరియాతో గండమే?: ముక్కలు చేస్తామని హెచ్చరిక.. పుతిన్ ఇలా!

అణ్వాయుధాలపై ప్రశ్నిస్తున్న ప్రపంచదేశాలకు ఉత్తరకొరియా చెబుతున్న సమాధానాలు ఏమాత్రం సహించడం లేదు. తమ దేశ భద్రత కోసమే తాము అణ్వాయుధాలు తయారుచేసుకుంటున్నామని ఉత్తరకొరియా ప్రకటించింది. అది దేశ భద్రతకు సంబంధించిన అంతర్గత విషయమని సమర్థించుకుంది. దీనిపై స్పందించిన విదేశాంగ మంత్రి జీన్‌-యువెస్‌ లి డ్రియాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ట్రంప్‌కు షాక్: అణ్వాయుధ పరీక్షలు ఆపే ప్రసక్తి లేదు: ఉత్తరకొరియాట్రంప్‌కు షాక్: అణ్వాయుధ పరీక్షలు ఆపే ప్రసక్తి లేదు: ఉత్తరకొరియా

అలా అయితే పెనుముప్పే:

అలా అయితే పెనుముప్పే:

ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలు ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేలా ఉన్నాయని జీన్-యువెస్ లి డ్రియాన్ అన్నారు. దౌత్యపరమైన చర్చల ద్వారా చైనా ఈ పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన సూచించారు. అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉత్తరకొరియా గనుక సంపాదిస్తే.. యూరోప్, జపాన్, చైనా కూడా అణుదాడి పరిధిలోకి వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే పరిస్థితులు మరింత దిగజారడం ఖాయమన్నారు.

యుద్ద మేఘాలు:

యుద్ద మేఘాలు:


యుద్దం దిశగా సాగుతున్న పరిణామాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. ఈ సంక్షోభానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఉత్తరకొరియాతో ప్రభావితమయ్యే దేశాలన్ని బేషరుతుగా చర్చల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఒత్తిళ్లు, బెదిరింపులు, యుద్ద నినాదాలు చర్చలను మరుగునపడేలా చేస్తాయని అన్నారు. ఉత్తరకొరియా అణ్వస్త్ర కార్యకలాపాలపై నిషేధం విధించడం ద్వారా ఫలితమేమి ఉండదని ఆయన పేర్కొనడం గమనార్హం.

దౌత్య ప్రణాళిక:

దౌత్య ప్రణాళిక:

నిజానికి అమెరికా ఒత్తిడితో ఐరాస విధించిన ఆంక్షలకు చైనా-ఉత్తరకొరియా మధ్య సంబంధాలు బలహీనపడాల్సి ఉంది. కానీ చైనా మాత్రం తాము ఆర్థికంగా దెబ్బ తింటున్నామంటూ గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది. చైనా ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోవడంతో ఉత్తరకొరియా సైతం యుద్దం ఆలోచనను తాత్కాళికంగా విరమించుకున్నట్లే కనిపించింది. కానీ ఆ తర్వాత మళ్లీ పాత కథే రిపీట్ అయింది.

ఈ నేపథ్యంలో దౌత్యపరమైన ఒప్పందాలే ఈ సమస్యకు పరిష్కారమని పుతిన్ అంటున్నారు.తాము, చైనా కలిపి తయారుచేసిన దౌత్య ప్రణాళికపై సంబంధిత దేశాలు సంతకాలు చేయాలని కోరుతున్నారు. ఉత్తరకొరియా అణ్వస్త్ర ప్రయోగాలను ఆపేయాలని, అదే సమయంలో జపాన్, దక్షిణకొరియా, అమెరికాలు యుద్ద కసరత్తులను నిలిపేయాలని చైనా, రష్యా ప్రతిపాదిస్తున్నాయి.

కాగా, తమ దేశ పౌరులు ఉత్తరకొరియాలో పర్యటించకుండా విధించిన ఆంక్షలు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి.

దోచుకు తినండి:కిమ్

దోచుకు తినండి:కిమ్

ఉత్తరకొరియా సైనికులకు అక్కడి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. సైనికులు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు ప్రచారం జరుగుతుండటంతో.. తిండి విషయంలో వారికి పూర్తి స్వేచ్చనిచ్చింది.దేశంలోని మొక్కజొన్న పంటలపై పడి దోచుకు తినండి అంటూ ఆదేశాలు జారీ చేసింది.

పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు కనిపించే మొక్కజొన్న పొలాలపై పడి దొంగిలించి కావాల్సినన్ని తినొచ్చని, ఈ విషయంలో సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఎంతసేపు అణ్వాయుధాలపై ప్రయోగాలే తప్పితే.. సైనికులకు పోషకాహారం అందించాలన్న స్పృహ ఉత్తరకొరియా ప్రభుత్వానికి లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి.

అమెరికాపై ఏ క్షణంలో అయిన క్షిపణి దండయాత్ర మొదలుపెట్టడానికి సన్నద్దంగా ఉండాలన్న ఉద్దేశంతోనే కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యుద్దం వస్తే సైనికులు ధృఢంగా ఉండి ఎదుర్కోవాలని ఆయన భావిస్తున్నారు. అందువల్లే దోచుకు తినండి అంటూ ఆదేశాలు జారీ చేసేదాకా వెళ్లిపోయారు.

English summary
As North Korean dictator Kim Jong-un boasts of his military prowess and flaunts his high tech weapons to the world, his malnourished soldiers are said to be stealing corn from fields to stave off hunger pangs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X