ఫ్లోరిడాను తాకిన ఇర్మా, సురక్షిత ప్రాంతాలకు తెలుగువారు

Posted By:
Subscribe to Oneindia Telugu

ఫ్లోరిడా: హరికేన్ ఇర్మా ఫ్లోరిడాను తాకింది. దీంతో భారీ వర్షాలు కురిశాయి. ఇర్మా ప్రభావంతో జనజీవనం స్తంభించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటల సమయంలో ఫ్లోరిడాను తాకింది.

ఇర్మా కారణంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో దాదాపు నాలుగు లక్షల మంది చీకట్లో మగ్గుతున్నారు. ఇర్మా కారణంగా గంటకు 130 మైళ్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Hurricane Irma: a million homes lose power as storm makes landfall in Florida

ఆదివారం రాత్రికి టంప ప్రాంతం మీదుగా ఇర్మా తీరాన్ని దాటే అవకాశముంది. 10 నుంచి 20 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. ఉద్ధృతంగా మారిన ఇర్మాను కేటగిరీ 4 హరికేన్‌గా అధికారులు ప్రకటించారు.

ఇర్మా వల్ల భారీ నష్టం వాటిల్లుతుందనే అంచనాల వ్ల లక్షలాది మందిని ఫ్లోరిడా నుంచి తరలించారు. ఇర్మా ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు వేయికి పైగా తెలుగు కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాయి.

కారకాస్‌, హవానా, జార్జ్‌టౌన్‌, పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో ఉన్న భారతీయులంతా క్షేమంగా ఉన్నట్లు విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు. ఇర్మా ధాటికి ఆయా ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. అక్కడ నివసించే భారతీయుల క్షేమ సమాచారాన్ని దౌత్య అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని సుష్మా చెప్పారు. ఫ్లోరిడాలో నివసించే భారతీయులను అట్లాంట తరలించేందుకు అన్ని సిద్ధం చేసినట్లు అంతకుముందే విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Florida governor Rick Scott is giving a noon briefing, with details about the Florida Keys, where reporters and officials have been almost entirely cut off from the mainland.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి