కరేబియన్‌ దీవుల్లో ‘ఇర్మా’ విలయం, 10 మంది మృతి, ఎమర్జెన్సీ ప్రకటన, వణుకుతున్న ఫ్లోరిడా..

Posted By:
Subscribe to Oneindia Telugu
  హార్వే పోయిందనుకుంటే.. ఇర్మా వచ్చింది, అమెరికాను వణికిస్తోన్న హరికేన్లు! : Video | Oneindia Telugu

  వాషింగ్టన్: అట్లాంటిక్‌ మహా సముద్రంలో పుట్టిన 'ఇర్మా' హరికేన్‌ కరేబియన్‌ దీవుల్లో విలయం తాడవం చేస్తోంది. యాంటిగువా, బర్బుడా, సెయింట్‌ మార్టిన్‌ వంటి దీవులు ఈ హరికేన్‌ ధాటికి కకావికలమై పోయాయి. వేర్వేరు దీవుల్లో పది మంది దుర్మరణం పాలయ్యారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు ప్రాంతాల్లో గంటకు 295 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

  గతంలో ఎన్నడూ లేనంతగా ఈ హరికేన్ రికార్డు స్థాయిలో ప్రళయ బీభత్సాన్ని సృష్టస్తోంది. దీంతో సహాయక చర్యలు చేపట్టడానికి కూడా ఇబ్బందిగా మారింది. ఇర్మాను అతి భయంకరమైన ఐదో కేటగిరీ హరికేన్‌గా అమెరికా జాతీయ హరికేన్‌ కేంద్రం ప్రకటించింది.

  సెయింట్‌ మార్టిన్‌, బర్బుడా కకావికలం...

  సెయింట్‌ మార్టిన్‌, బర్బుడా కకావికలం...

  సెయింట్‌ మార్టిన్‌లో దాదాపు 95శాతం ఇళ్లు గాలికి కొట్టుకుపోయాయి. ఈ ప్రాంతంలో 8మంది దుర్మరణం చెందగా, 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సెయింట్‌ బర్టాస్‌లోనూ ఇర్మా పెను బీభత్సం సృష్టించింది. ఇక యాంటిగువా, బర్బుడా దీవుల్లోనూ 90 శాతం ప్రాతం కకావికలమైపోయింది. 60 శాతం ప్రజలు నిరాశ్రయులైపోయారు. ఇక్కడ రెండేళ్ల చిన్నారి మరణించింది. దాదాపు 1600 మంది ప్రజలు రోడ్డుపాలయ్యారని బర్బుడా ప్రధాని గాస్టన్‌ బ్రౌన్‌ తెలిపారు. బర్బడోస్‌ దీవిలో 16 ఏళ్ల కుర్రాడు ప్రాణాలు కోల్పోయినట్లు వరల్డ్‌ సర్ఫ్‌ లీగ్‌ వెల్లడించింది.

  ప్యుర్టో రికో, వర్జిన్ ఐలాండ్స్ లో విధ్వంసం...

  ప్యుర్టో రికో, వర్జిన్ ఐలాండ్స్ లో విధ్వంసం...

  గురువారం నాటికి ఇర్మా హరికేన్‌ డొమినికన్‌ రిపబ్లిక్‌, హైతీ దీవులనూ తాకింది. తూర్పు క్యూబా మీదుగా మరో రెండు రోజుల్లో ఫ్లోరిడాలో ప్రవేశించనుంది. ఇప్పటికే ప్యుర్టో రికోతో పాటు అమెరికాలోని వర్జిన్‌ దీవుల్లోనూ ఇర్మా బీభత్సం సృష్టించింది. ప్యుర్టో రికోలో దాదాపు 30 లక్షల మంది అంధకారంలో జీవిస్తున్నారు.

  టెక్సాస్ లో బిక్కుబిక్కుమంటూ...

  టెక్సాస్ లో బిక్కుబిక్కుమంటూ...

  గత వారమే అమెరికాలోని టెక్సాస్ ను హార్వే హరికేన్‌ ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ హార్వే ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు 12 స్వచ్ఛంద సంస్థలకు అధ్యక్షుడు ట్రంప్‌ రూ.6.7 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఇర్మా హరికేన్ విలయతాండవం చేస్తుండడంతో.. టెక్సాస్ రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్న భారతీయులు ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

  ‘‘నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయలేం...''

  ‘‘నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయలేం...''

  ఇర్మా హరికేన్‌ ప్రభావం భయానకంగా, క్రూరంగా ఉండొచ్చని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ అన్నారు. ఫ్రెంచ్‌ కరేబియన్‌ దీవులు సెయింట్‌ మార్టిన్‌, సెయింట్‌ బర్టాస్‌ తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఏ స్థాయిలో నష్టం జరిగిందనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.

  కరేబియన్ దీవులకు బ్రిటన్ మిలటరీ నౌక...

  కరేబియన్ దీవులకు బ్రిటన్ మిలటరీ నౌక...

  ఇర్మా హరికేన్‌ ధాటికి కకావికలమైన కరేబియన్‌ దీవులను ఆదుకునేందుకు ఒక మిలటరీ నౌకను పంపినట్లు, రూ.100.4 కోట్ల నిధులను ఇవ్వనున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం వెల్లడించింది.

  అప్రమత్తమైన ఫ్లోరిడా...

  అప్రమత్తమైన ఫ్లోరిడా...

  కరేబియన్‌ దీవుల్లో విలయం సృష్టించిన ఇర్మా హరికేన్‌ అమెరికా తీర ప్రాంత రాష్ట్రమైన ఫ్లోరిడాను ముంచెత్తనుంది. కరేబియన్‌ దీవుల నుంచి వాయవ్యంగా పయనించి ప్యుర్టో రికో, వర్జిన్‌ దీవుల మీదుగా ఆదివారానికి ఫ్లోరిడాను తాకబోతోంది.

  ట్రంప్ ఎమర్జెన్సీ ప్రకటన...

  ట్రంప్ ఎమర్జెన్సీ ప్రకటన...

  ఈ శతాబ్దంలోనే ఇర్మా అత్యంత భయానక హరికేన్‌గా అమెరికా జాతీయ హరికేన్‌ కేంద్రం వెల్లడించింది. గంటకు 295 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తుండడంతో అమెరికా అప్రమత్తమైంది. ఫ్లోరిడా సహా ప్యుర్టో రికో, వర్జీనియా దీవుల్లో అధ్యక్షుడు ట్రంప్‌ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

  సురక్షిత ప్రాంతాలకు తరలింపు...

  సురక్షిత ప్రాంతాలకు తరలింపు...

  దక్షిణ ఫ్లోరిడా ప్రాంతం ఇర్మా ధాటికి తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉండడంతో అక్కడి నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇక్కడ వేలాది భారత అమెరికన్లు జీవిస్తున్నారు.

  మియామి నగరంలో...

  మియామి నగరంలో...

  ఇప్పటికే హర్వే హరికేన్‌ ధాటికి అల్లకల్లోమైన అమెరికా ప్రజలు ఇర్మా ముప్పుపై భయకంపితులవుతున్నారు. నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు ముందుగానే మియామి నగరం నుంచి దాదాపు లక్ష మందిని ఖాళీ చేయిస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Irma, the strongest Atlantic Ocean hurricane ever measured and roughly the size of Tasmania, destroyed homes and flooded streets throughout a chain of small islands in the northern Caribbean on Wednesday, passing directly over Barbuda and leaving the island of some 1,700 people cut off.France has sent emergency food and water rations to the French islands of Saint Martin and Saint Barthelemy, where Irma ripped off roofs and knocked out all electricity. The category five storm — the highest hurricane nomination by the US National Hurricane Centre (NHC) — had maximum sustained winds of 295 kilometres per hour.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X