ఘోరం: పెళ్లి ఫొటో ఫేస్‌బుక్‌లో పెట్టి.. భార్యను చంపి..

ఫేస్‌బుక్‌లో తమ పెళ్లి ఫోటోను షేర్ చేసిన కొద్ది సేపటికే ఓ యువకుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. మూడేళ్ల తమ వివాహ బంధాన్ని కాలరాస్తూ భార్యను దారుణంగా హతమార్చాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.

లండన్: ఫేస్‌బుక్‌లో తమ పెళ్లి ఫోటోను షేర్ చేసిన కొద్ది సేపటికే ఓ యువకుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. మూడేళ్ల తమ వివాహ బంధాన్ని కాలరాస్తూ భార్యను దారుణంగా హతమార్చాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే... ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ శివారులోని వెస్ట్ మిడ్ ల్యాండ్ ప్రాంతంలో జేమ్స్ బక్కీ బర్నెస్(32), అమీ బర్నెస్ (30) దంపతులు నివసిస్తున్నారు. మూడేళ్ల క్రితమే వారికి వివాహమైంది. వీరిద్దరూ చెరోచోట విగతజీవులుగా కనిపించడం స్థానికులను కలవరపాటుకు గురిచేసింది.

స్థానిక మీడియా కథనం ప్రకారం.. జేమ్స్ తన నివాసంలో చనిపోయి కనిపించగా... అతడి తల్లిదండ్రులకు చెందిన ఓ గార్డెన్‌లో అతడి భార్య అమీ మృతదేహాన్ని గుర్తించారు. ఇంటికీ గార్డెన్‌కు మధ్య 20 మైళ్ల దూరం ఉంది.

Husband uploaded wedding photo to Facebook before 'killing his wife then himself in murder-suicide'

చనిపోవడానికి కొద్ది సేపటి ముందే జేమ్స్ తమ పెళ్లి ఫోటోను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు.
అంతేకాదు, ''అందరికీ కృతజ్ఞతలు... నాశనం అయిపోయింది..'' అంటూ ఓ కామెంట్ కూడా రాశాడు.

జేమ్స్ తన భార్యను ముందే హతమార్చి అనంతరం అతడు కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటనలో మూడో వ్యక్తి ప్రమేయానికి అవకాశమే లేదని వారు చెబుతున్నారు.

వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలూ ఉన్నట్టు వినలేదని.. తాము ఊహించిన దానికంటే సఖ్యంగా ఉండేవారని స్థానికుడొకరు వెల్లడించారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే దీనిపై ఒక స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+