వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సద్దాం చివరి రోజుల్లో ఎలా ఉండేవాడు?: జైల్లో కొడుకు గురించి సైనికులకు ఏం చెప్పాడు?

పార్టీలో చాలామంది ప్రాణాలు తీసిన ఉదయ్ పట్ల సద్దాం తీవ్ర ఆగ్రహావేశంతో రగిలిపోయారట. ఉదయ్ వాడే లగ్జరీ కార్లన్నింటిని తగలబెట్టేశారట.

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: సద్దాం హుస్సేన్.. ఈ పేరు వింటే ఓ యుద్దోన్మాది.. ఓ నియంత గుర్తుకొస్తారు. ఇరాక్ లోని సున్నీ ప్రజలకూ ఆయన ఆరాధ్యనీయుడు కూడా. ప్రపంచ ఆయిల్ కంపెనీల సామ్రాజ్యవాదులను గడగడలాడించిన సద్దాం.. అమెరికా చేతిలో బంధీగా 2006 డిసెంబరు 20వ తేదీన ఉరికంభం ఎక్కారు.

1976నుంచి 2013వరకు ఇరాక్ ను అప్రతిహతంగా పాలించిన సద్దాం.. అమెరికా గద్దె దింపిన తర్వాత 2ఏళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సద్దాం కోసం తీవ్రంగా అన్వేషించిన అమెరికా సేనలు ఎట్టకేలకు ఆయన్ను వెతికి పట్టుకుని మరీ ఉరితీశాయి. తాజాగా సద్దాం చివరి రోజులకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.

ది ప్రిజనర్ ఇన్ హిజ్ ప్యాలెస్:సద్దాం హుస్సేన్

ది ప్రిజనర్ ఇన్ హిజ్ ప్యాలెస్:సద్దాం హుస్సేన్

సద్దాం తన చివరి రోజుల్లో ఎలాంటి జైలు జీవితం గడిపాడనే విషయంపై 'ది ప్రిజనర్ ఇన్ హిజ్ ప్యాలెస్:సద్దాం హుస్సేన్' పుస్తకంలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బర్డన్ వేర్సర్ అనే అమెరికా సైనికుడు ఈ పుస్తకాన్ని వెలువరించారు. ఆరు నెలల పాటు అమెరికా సైనికులు ఆయనకు కాపలాగా ఉన్నారని పుస్తకంలో పేర్కొన్నారు. సైనికులతో సద్దాం సన్నిహితంగా ఉండేవాడని, వారితో తరుచు మాట్లాడుతుండేవారని రాశారు.

అందమైన పూలను చూస్తూ..

అందమైన పూలను చూస్తూ..

ఆహారం విషయంలో సద్దాం చాలా జాగ్రత్తగా ఉండేవారని, తాజా పండ్లు, ఆమ్లెట్, కేక్ వంటివి బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువగా తీసుకునేవారని అన్నారు. ఆమ్లెట్ ఎప్పుడైనా సరిగా లేకపోతే తినేందుకు నిరాకరించేవారని చెప్పుకొచ్చారు. జైలు గదిలోని ఓ పక్కగా కూర్చొని.. అందమైన పూలను చూస్తూ ఎక్కువ సమయం గడిపేవారని వెల్లడించారు.

సైనికలకు కథలు

సైనికలకు కథలు

సైనికులకు అప్పుడప్పుడు కథలు కూడా చెప్పేవారని పేర్కొన్నారు. అంతేకాదు, తన కొడుకును పెంచడంలో ఎంత క్రమశిక్షణగా వ్యవహరించింది సద్దాం సైనికులకు వివరించారట. ఇందుకోసం ఆయన ఓ సంఘటన గురించి కూడా చెప్పారట. తన కొడుకు ఉదయ్ ఓ పార్టీలో హంతకుడిగా మారడం పట్ల సద్దాం కఠినంగా వ్యవహరించారట.

కొడుకు గురించి ఇలా:

కొడుకు గురించి ఇలా:

పార్టీలో చాలామంది ప్రాణాలు తీసిన ఉదయ్ పట్ల సద్దాం తీవ్ర ఆగ్రహావేశంతో రగిలిపోయారట. ఉదయ్ వాడే లగ్జరీ కార్లన్నింటిని తగలబెట్టేశారట. తన కొడుకు రోల్స్ రాయిస్, ఫెరారీ, పోర్షే వంటి లగ్జరీ కార్లు వాడినట్లు సద్దాం చెప్పేవాడట. ప్రపంచం చేత నియంత అనిపించుకున్న సద్దాం.. కొడుకు క్రమశిక్షణ విషయంలోను కఠినంగా వ్యవహరించారని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.

English summary
Saddam Hussein spent his final days listening to Mary J Blige, gorging on muffins and riding a rickety exercise bike nicknamed Pony, says a new book by one of the US troops who guarded him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X