వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి
For Daily Alerts
Oneindia App Download

'నేను మోడీ... మీరు మోరీ': కాశీపై ఒప్పందం(పిక్చర్స్)

By Srinivas

Google Oneindia TeluguNews

టోక్యో: జపాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం క్యోటోలోని బుద్దిస్ట్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీ ఆదివారం నాడు క్యోటో నగరంలోని బుద్ధ దేవాలయాన్ని సందర్శించారు. అక్కడి ప్రధాన మతగురువు యాసు నగమోరి (83)తో కొంత సమయం గడిపారు.

ఈ సందర్భంగా మోడీ పరిచయ వచనాల్లో భాగంగా.. "నేను మోడీ... మీరు మోరి" అంటూ వ్యాఖ్యానించారు. దీంతో, అక్కడ ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. కాగా, ఈ ఆలయాన్ని 1397లో నిర్మించారు. దీన్ని కింకాకు-జి ఆలయం అని పిలుస్తారు. మోడీ తన క్యోటో పర్యటనలో భాగంగా 57 మీటర్ల ఎత్తున్న తోజి ఆలయాన్ని కూడా సందర్శించారు.

'I am Modi, you are Mori!'

మోడీ పర్యటనలో భాగంగా భారత్ - జపాన్‌ల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. ఇందులోభాగంగా తొలి రోజే ఇరుదేశాల మధ్య అరుదైన ఒప్పందం కుదిరింది. ప్రాచీన కట్టడాలను, సంస్కృతిని పరిరక్షిస్తూనే స్మార్ట్ సిటీలను నిర్మించేందుకు ఉద్దేశించిన ఒప్పందం ఉంది. జపాన్ ప్రాచీన నగరం క్యోటో భారతీయ ఆధ్యాత్మిక నగరంగా పేరుగాంచిన నగరం. మోడీ సొంత పార్లమెంట్ నియోజకవర్గం వారణాసి, ట్యోకోల మధ్య ఈ ఒప్పందం కుదిరింది.

Kyoto (Japan): PM Narendra Modi visits Kinkaku-ji Temple pic.twitter.com/ctzXvDeSFz
— ANI (@ANI_news) August 31, 2014

క్యోటో నగర మేయర్ దాయిసకూ కడోకవా, జపాన్‌లో భారత రాయబారి దీపా గోపాలన్‌లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. జపాన్‌లో మోడీ ఐదు రోజుల పర్యటన, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, అణ్వస్త్ర రంగాలకు సంబంధించిన పలు ఒప్పందాలపై ఇరుదేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిర్చే అవకాశాలున్నాయి. బుల్లెట్ రైళ్లకు సంబంధించిన ప్రాజెక్టు కూడా మోడీ పర్యటనలో ప్రధానంగా చర్చకు రానున్నాయి.

Kyoto (Japan): PM Narendra Modi at Kinkaku-ji Temple pic.twitter.com/J9CcmbuoSW
— ANI (@ANI_news) August 31, 2014

Kyoto (Japan): PM Narendra Modi at Kinkaku-ji Temple pic.twitter.com/yeUWXmIgoW
— ANI (@ANI_news) August 31, 2014

English summary
"I am Modi and you are Mori!" This is how Indian Prime Minister Narendra Modi greeted the head monk of a Buddhist temple he visited here Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X