కలలో భార్య హత్య, పోలీసులకు ఫోన్ చేసి ఇలా...

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. కలలో తన భార్యను హత్య చేశానని పోలీసులకు కట్టుకథలు చెప్పారు. చివరికి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

అమెరికాలోని నార్త్‌ కరోలినాకు చెందిన మాథ్యూ జేమ్స్ ఫెల్స్‌కు గత ఏడాది నవంబర్‌లో లారెన్ ఫెల్ప్స్‌తో వివాహం జరిగింది. అయితే శుక్రవారం నాడు అర్ధరాత్రి ఎమర్జెన్సీ 911కు కాల్ చేసిన జేమ్స్ తన భార్యను హత్య చేసినట్టుగా అనిపిస్తోందని ఆరు నిమిషాలు ఫోన్‌లో మాట్లాడారు.

పోలీసులు, ఎమర్జెన్సీ సర్వీస్ అధికారులతో పాటు పోలీసులు అక్కడికి వచ్చి లారెన్ మృతి చెందారు. అనంతరం జేమ్స్‌ను అరెస్ట్ చేసి వేక్ కౌంటీ జైలుకు తరలించారు.

‘I can’t believe I did this’: US man tells 911 he thinks he killed his wife after having too much medicine

దగ్గు సమస్యతో ఉన్న తాను కొరిసిడిన్ టాబ్లెట్ వేసుకొని నిద్రపోయానని కొన్ని గంటల తర్వాత మెలకువ వచ్చి లైట్ ఆన్ చేసినట్టు చెప్పారు. బెడ్ మీద రక్తపు మరకలున్నాయని, తన భార్య లారెన్ రక్తపు మడుగులో ఉందన్నారు.

బెడ్‌పై కత్తి కూడ ఉందన్నారు. లారెన్ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. ఆమెను హత్య చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. టాబ్లెట్ డోస్ ఎక్కువైందన్నారు.దాని ప్రభావం తనకు తెలియకుండా కలలోనే భార్యను హత్య చేసి ఉండొచ్చని ఇదే విషయాన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్‌కు కాల్ చేసి చెప్పినట్టు వివరించారు.ఉద్దేశ్యపూర్వకంగా భార్యను హత్య చేసి జేమ్స్ కట్టు కథలు చెబుతున్నారని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+