వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరాచీలో 2సార్లు దావూద్‌ని కలిశా: పాకిస్తాన్ జర్నలిస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ ఒకరు తమ దేశానికి దావూద్ ఇబ్రహీం విషయంలో షాకిచ్చాడు! తాను దావూద్ ఇబ్రహీంను కరాచీలో కలుసుకున్నానని జర్నలిస్ట్ ఆరిఫ్ జమాల్ చెప్పాడు.

తద్వారా, అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడన్న పాకిస్థాన్ వాదనలో పస లేదని మరోసారి రుజువైంది. కరాచీలో ఉన్న దావూద్ ఇబ్రహీంను తాను రెండుసార్లు నేరుగా కలిశానని పాక్‌కు చెందిన సదరు సీనియర్ జర్నలిస్ట్ ఆరిఫ్ చెప్పారు.

I met Dawood Ibrahim in Karachi, says Pak journalist Arif Jamal

ఆయన ఇండియా టుడేకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తాను కరాచీలో దావూద్ ఇబ్రహీంను కలుసుకున్నట్లు కుండబద్దలు కొట్టారు.

ప్రస్తుతం అమెరికాలోని వర్జీనియాలో నివసిస్తున్న ఆరిఫ్ జమాల్ గతంలో న్యూయార్క్ టైమ్స్‌కు పాకిస్థాన్‌లో కంట్రిబ్యూటర్‌గా చేశారు. కరాచీలో ఉన్న దావూద్ ఇబ్రహీం అతికొద్ది మందిని మాత్రమే కలుస్తాడని అతను చెప్పాడు. దావూద్ పొరుగింటిలో అతడి సోదరుడు అనీస్ ఇబ్రహీం నివసిస్తున్నాడని ఆరిఫ్ జమాల్ చెప్పాడు.

English summary
In an interview with India Today, reputed Pakistani author and journalist Arif Jamal said that he met 1993 Mumbai serial blasts mastermind and most wanted underworld don Dawood Ibrahim in Karachi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X