వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలర్ట్.. అలర్ట్... స్పై ఆరోపణలపై జాదవ్ తీర్పు రేపే, ఇంటర్నేషనల్ కోర్టు తీర్పుపై ఉత్కంఠ

|
Google Oneindia TeluguNews

ది హేగ్ : గూఢచర్యం ఆరోపణలతో భారత్‌కు చెందిన మాజీ నేవీ అధికారి కుల్‌భూషన్ జాదవ్‌పై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు విధించిన ఉరిశిక్షకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానం బుధవారం తీర్పునివ్వనుంది. తమ దేశంపై గూఢచర్యం నిర్వహించారని, ఉగ్రవాదాన్ని ప్రేరేపించారని ఆరోపణలు చేసింది పాకిస్థాన్ మిలిటరీ కోర్టు. ఈ మేరకు అభియోగాలు మోపి ఉరిశిక్ష కూడా విధించింది. దీనిని భారత్ ఖండించింది. పాకిస్థాన్ విధించిన ఉరిశిక్షను తప్పుపడుతూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఉత్కంఠ ..
జాదవ్ కేసులో భారత్, పాకిస్థాన్ వాద, ప్రతివాదనలు అంతర్జాతీయ న్యాయస్థానం ఆలకించింది. ఈ కేసులో బుధవారం తీర్పు వెల్లడించనుంది. జులై 17న తీర్పు వెల్లడిస్తామని హేగ్‌లో ఇంటర్నేషనల్ కోర్టు కొద్దిరోజుల క్రితం వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు సీజేఏ అబ్దుల్ అహ్మద్ యూసుఫ్ నేతృత్వంలోని 10 మంది సభ్యులు గల ధర్మాసనం తీర్పునిస్తుంది. పాకిస్థాన్ మోపిన కుట్రపూరిత అభియోగాలపై 2017 మే 8న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని భారత్ ఆశ్రయించింది. మాజీ నేవీ అధికారిపై లేనిపోని ఆరోపణలు చేసిందని వాదనలు వినిపించింది. అంతేకాదు వియన్నా ఒప్పందాన్ని పాకిస్థాన్ యధేచ్చగా ఉల్లంఘిస్తోందని గుర్తుచేసింది. ఫిబ్రవరిలో పుల్వామాలో ఉగ్రవాదుల బీభత్సంతో ఉపఖండంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్; పాకిస్థాన్ జాదవ్ కు సంబంధించిన వాదనలను వినిపించాయి. భారత్ తరఫున ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే దవాదించారు. పాకిస్థాన్ మిలిటరీ కోర్టు శిక్షల గురించి ప్రశ్నించారు.

ICJ to deliver verdict in Kulbhushan Jadhav case tomorrow

ఇదీ నేపథ్యం ..

బలూచిస్థాన్‌లో ఉన్న జాదవ్‌ను పాకిస్థాన్ మిలిటరీ అదుపులోకి తీసుకుంది. 2016 మార్చి 3న .. ఇరాన్ నుంచి వ్యాపార నిమిత్తం వస్తోన్న అతడిని అరెస్ట్ చేసింది. తర్వాత జాదవ్ కిడ్నాప్‌నకు గురయ్యాడని భారత్ ఫిర్యాదు చేసింది. కానీ ఇరాన్‌లో లేకపోవడంతో అనుమానం వచ్చింది. కానీ తోలుత నిరాకరించిన తర్వాత తమ వద్దే ఉన్నాడని అంగీకరించింది. తమ దేశంపై నిఘా పెట్టారనే ఆరోపణలు మోపి .. మిలిటరీ కోర్టులో అభూత సాక్ష్యాలు ప్రవేశపెట్టింది. ఆ తర్వాత జరిగిన ఉద్రిక్తతతో .. జాదవ్ తల్లి, భార్య .. 2017 డిసెంబర్ 25న జైలులో కలిసిన సంగతి తెలిసిందే.

English summary
The International Court of Justice will deliver on Wednesday its verdict in a case relating to Indian national Kulbhushan Jadhav, whose death sentence by a Pakistani military court based on an "extracted confession" has been questioned by India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X