ఇజ్రాయెల్ భీకర దాడుల్లో హమాస్ చీఫ్ హతం

Israel: హమాస్, హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై వరుసబెట్టి దాడులు సాగిస్తూ వస్తోన్న ఇజ్రాయెల్‌ మరో పురోగతిని సాధించింది. హమాస్ చీఫ్ కమాండర్‌ మహ్మద్ సిన్వర్ ను హతమార్చింది. అతని మృతదేహాన్ని గుర్తించినట్లు సౌదీ అరేబియాకు చెందిన న్యూస్ అవుట్ లెట్ అల్- హదత్ తెలిపింది.

తాజాగా ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 13వ తేదీన హమాస్ శిబిరాలపై నిర్వహించిన మిస్సైళ్ల దాడుల సందర్భంగా మహ్మద్ సిన్వర్ హతమైనట్లు ఇజ్రాయెట్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది. నాటి దాడుల్లో హతమైంది సిన్వరేనని నిర్ధారించుకున్నట్లు పేర్కొంది.

IDF confirms Head of Hamas Muhammad Sinwar killed in its strike

గాజాలోని ఖాన్ యూనిస్ లో గల ఓ టన్నెల్ లో సిన్వర్ మృతదేహాన్ని గుర్తించామని ఐడీఎఫ్ వివరించింది. సిన్వర్ మృతితో హమాస్ కు దాదాపుగా నాయకత్వం లేకుండా పోయిందని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అభిప్రాయపడింది. హమాస్ బలహీనపడిందనడానికి ఇది తాజా ఉదాహరణగా చెప్పుకొచ్చింది.

గత ఏడాది అక్టోబర్ లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హతమైన యాహ్యా సిన్వర్ తమ్ముడే ఈ మహ్మద్ సిన్వర్. యాహ్యా తరువాత హమాస్ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించాడు. ఇన్ని రోజులూ ఇజ్రాయెల్ పై ప్రతిదాడులకు సారథ్యాన్ని వహించాడు. ఖాన్ యూనిస్ పై ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో సిన్వర్ తో పాటు రఫా బ్రిగేడ్ కమాండర్ మహ్మద్ షబానా కూడా మరణించినట్లు చెబుతున్నారు.

ప్రతీకార దాడులతో ఏడాదిన్నర కాలంగా మధ్య తూర్పు దేశాలు భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. రోజుల తరబడి దాడులు ప్రతిదాడులు కొనసాగుతోన్నాయి. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్‌.. రోజూ పరస్పర దాడులకు దిగుతోన్నాయి. గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మిస్సైళ్లు, రాకెట్లను సంధిస్తూ వస్తోంది.

ఈ దాడుల్లో ఈ రెండు గ్రూప్‌లకు చెందిన పెద్ద తలకాయలు తెగిపడ్డాయి. హసన్ నస్రల్లా, యాహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియె, సమీ తాలెబ్ అబ్దల్లా, ఫతా షరీఫ్, మర్వాన్ ఇసా, ఇబ్రహిం వకీల్, అహ్మద్ వహ్బీ.. వంటి సీనియర్ నాయకులు, కమాండర్లు హతం అయ్యారు. హషెమ్ షఫియొద్దీన్, హుస్సేన్ అలీ హజీమాను మట్టుపెట్టింది ఇజ్రాయెల్.

హెజ్బొల్లా, హమాస్..ఈ రెండింటినీ ఏకకాలంలో మట్టుపెట్టింది. లెబనాన్‌, గాజాల్లో మొత్తంగా 1,300లకు పైగా ఆయా మిలిటెంట్ గ్రూపుల స్థావరాలపై ఈ దాడులు సాగించింది ఇజ్రాయెల్. బీకా వ్యాలీ,సిడాన్, మర్జయాన్, నబాటి, టయర్, జెజ్ఝీన్, జెహ్రానీ జిల్లాలతో పాటు తూర్పు ప్రాంతంలోని జహ్లేయ్, బాల్బెక్, హెర్మెల్‌ వంటి ప్రాంతాలపై నిరంతరాయంగా దాడులు సాగుతోన్నాయి.

దీనికి కారణాలు లేకపోలేదు. 2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయెల్‌పై భీకర దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన పలువురిని అపహరించింది హమాస్. దీనికి ప్రతీకారాన్ని తీర్చుకుంటూ వచ్చింది ఇజ్రాయెల్. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచీ క్రమం తప్పకుండా డ్రోన్ దాడులను నిర్వహించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+