‘ట్రంప్ ఓ మొరిగే కుక్క, భయపడక్కర్లేదు..’, ఆజ్యం పోసిన ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి

వరుస క్షిపణి ప్రయోగాలతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా మరోసారి అమెరికాను రెచ్చగొట్టేందుకు సిద్ధమైంది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలను కుక్క అరుపులతో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చ

సియోల్‌: వరుస క్షిపణి ప్రయోగాలతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా మరోసారి అమెరికాను రెచ్చగొట్టేందుకు సిద్ధమైంది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలను కుక్క అరుపులతో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఇటీవల ఐక్యరాజ్యసమితి వేదికగా తొలిసారి ప్రసంగించిన ట్రంప్‌.. ఉత్తరకొరియాపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. అమెరికా లేదా యూఎస్‌ కూటమి దేశాలు ఒక్కసారి దాడిచేస్తే ఉత్తరకొరియా పూర్తిగా నాశనమవుతుందని ట్రంప్‌ హెచ్చరించారు.

"If he was thinking he could scare us with the sound of a dog barking, that's really a dog dream."

ఐక్యరాజ్యసమితి సమావేశం కోసం న్యూయార్క్‌ వచ్చిన ఉత్తరకొరియా విదేశాంగమంత్రి రియాంగ్‌ హోను ట్రంప్‌ హెచ్చరికలపై ప్రశ్నించగా.. ''ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరగడం సహజమే.. మొరిగే కుక్కలు కరవవు కదా... అలా కుక్క అరుపులతో వారు(ట్రంప్‌) బెదిరించాలనుకుంటే దానికి మేం భయపడం..'' అని రియాంగ్‌ వ్యాఖ్యానించారు.

ఇటీవల ఉత్తరకొరియా అతి శక్తిమంతమైన హైడ్రోజన్‌ బాంబును పరీక్షించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించి.. జపాన్‌వాసులను బెదిరించింది. ఈ వరుస చర్యలతో తీవ్రంగా మండిపడ్డ అమెరికా.. ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని ఐరాస ఆమోదించింది.

ఇటీవల జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో మాట్లాడిన ట్రంప్‌.. ఉత్తరకొరియాను గట్టిగా హెచ్చరించారు కూడా. ఆ దేశ ఆగడాలను అడ్డుకునేందుకు ఆసియా దేశాలు కూడా అమెరికాతో చేతులు కలపాలని ట్రంప్‌ కోరారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశిస్తూ ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదం అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+