అవసరమైతే అణుబాంబులు ఉపయోగిస్తాం: పాక్
ఇస్లామాబాద్: తమ రక్షణ కోసం అవసరమైతే అణుబాంబులు ఉపయోగించడానికి వెనుకాడమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ తెలిపారు. పాక్ ఛానల్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా భారత్‌కు హెచ్చరికలు చేశారు.
‘మమ్మల్ని రక్షించుకోవడానికి అణుబాంబులు మాకున్న అవకాశాల్లో ఒకటి. వాటిని కేవలం ప్రదర్శన కోసం మేం ఉంచుకోవడం లేదు. అయితే ఆ అవసరం ఎప్పటికీ రాకూడదని మేం భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాం. కానీ మాకే ప్రమాదం వస్తే ఉపేక్షించేది లేద'ని పరోక్షంగా భారత్‌ను హెచ్చరించారు.

ఉగ్రవాదం పేట్రేగిపోతుండడం.. భారత్‌తో పరోక్ష యుద్ధానికి దారి తీయొచ్చని చెప్పారు. పాకిస్థాన్ రక్షణ పరంగా బలంగా ఉందని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications