భారత్ దెబ్బ అదుర్స్..! పాకిస్తాన్ కు ప్రపంచ బ్యాంక్ భారీ షాక్..!
పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కొనసాగుతున్న తరుణంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో పాకిస్తాన్ కు ప్రపంచ బ్యాంక్ 2 బిలియన్ డాలర్ల రుణ ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చేందుకు అంగీకరించడం కూడా ఒకటి. అయితే కీలక సమయంలో పాకిస్తాన్ కు ఇంత భారీ మొత్తం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకరించిన సమయంలో ఓటింగ్ కు భారత్ దూరంగా ఉండిపోవడంపై విమర్శలు వచ్చాయి. అయితే ఓటింగ్ లో పాల్గొనకపోయినా భారత్ మాత్రం ప్రపంచ బ్యాంక్ కు ఈ రుణంపై పునరాలోచించాలని విజ్ఞప్తులు చేసింది.
దీనిపై ఇవాళ ప్రపంచ బ్యాంక్ స్పందించింది. పాకిస్తాన్ కు ఇవ్వదల్చిన రుణానికి పలు షరతులు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కు ప్రపంచ బ్యాంక్ ఇస్తున్న నిధులు ఉగ్రవాదానికి ప్రోత్సాహం కోసం ఖర్చుపెడుతుందన్న భారత్ ఆరోపణల నేపథ్యంలో వీటి లభ్యత కోసం మొత్తం 11 షరతులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ 11 షరతులకు అంగీకరిస్తేనే ఆ భారీ రుణ ప్యాకేజీ పాకిస్తాన్ కు అందేలా ఉంది.

ఇప్పటికే పాకిస్తాన్ కు ఇవ్వాలనుకుంటున్న ఆ 2 బిలియన్ డాలర్ల రుణానికి సంబంధించి పలు షరతులు పెట్టిన ప్రపంచ బ్యాంక్ ఇప్పుడు తాజా నిర్ణయంతో మొత్తం 50 షరతులు విధించినట్లు తెలుస్తోంది. ఇందులో పాకిస్తాన్ తమ 17.6 ట్రిలియన్ల బడ్జెట్ కు పార్లమెంట్ ఆమోదం తీసుకోవాలని షరతు పెట్టింది. అలాగే కరెంటు బిల్లులపై సర్ ఛార్జీల మోత మోగించాలని మరో షరతు పెట్టింది. దీంతో పాటు విదేశాల నుంచి మూడేళ్లకు పైగా వాడిన సెకండ్ హ్యాండ్ కార్లను దిగుమతి చేసుకునేందుకు అనుమతివ్వాలని సూచించింది.
పాకిస్తాన్ పెట్టిన ఇతర షరతుల్లో రాష్ట్రాల స్ధాయిలో వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించడం, పాలనా సంస్కరణలు, 2027 తర్వాత ఆర్ధిక వ్యవస్ధలో చేయాల్సిన మార్పులు, వార్షిక కరెంటు బిల్లుల వసూళ్ల విధానంలో మార్పు, గ్యాస్ ధరలపై ఆరు నెలలకోసారి పన్నుల సవరణ, జాతీయ గ్రిడ్ కు పరిశ్రమల విద్యుత్ సరఫరాకు ఆర్డినెన్స్, రుణాల సర్వీసింగ్ ఛార్జీలపై నియంత్రణ ఎత్తేయడం, టెక్నాలజీ జోన్లకు 2035 నాటికి అన్ని రాయితీల ఎత్తివేత, మొత్తం దేశ బడ్జెట్ 17.6 ట్రిలియన్లలో ఒక ట్రిలియన్ అభివృద్ధికి ఖర్చుపెట్టడం వంటి షరతులున్నాయి.












Click it and Unblock the Notifications