అమెరికా, యూరప్ కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..! మీ నిర్ణయం బ్యాక్ ఫైర్..!

వలసలను నియంత్రించడం వల్ల మీ స్వంత ప్రయోజనాలకే నష్టం వాటిల్లుతుందని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇవాళ అమెరికా, యూరప్ దేశాలకు కీలక హెచ్చరిక చేశారు.

అమెరికాలో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వలసలపై ఉరుముతున్నారు. ట్రంప్ ను చూసి ఇదే బాటలో యూరప్ దేశాలు కూడా పయనిస్తున్నాయి. విదేశీ పౌరుల వల్ల తమకు నష్టం జరుగుతుందన్న వాదనను తెరపైకి తెచ్చి స్వదేశాల్లో తమ స్ధానాల్ని పటిష్టం చేసుకునేందుకు అమెరికా, యూరప్ అధినేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఇవాళ వారికి కీలక హెచ్చరికలు చేసింది.

వలసలను నియంత్రించడం వల్ల మీ స్వంత ప్రయోజనాలకే నష్టం వాటిల్లుతుందని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇవాళ అమెరికా, యూరప్ దేశాలకు కీలక హెచ్చరిక చేశారు. ఆర్థిక సమస్యలు పరిశ్రమలను తరలించడం వల్లే ఉత్పన్నమవుతాయని ఆయన తేల్చిచెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వలసలపై ఎదురవుతున్న రాజకీయ, సామాజిక విమర్శలపై మాట్లాడిన జైశంకర్.. నైపుణ్యం కలిగిన కార్మికుల సరిహద్దు కదలికపై భారీ ఆంక్షలు విధించడం వల్ల అమెరికా, యూరప్ వంటి దేశాలు స్వంత ప్రయోజనాలను హాని చేసుకోవడమే కాకుండా నికరంగా నష్టపోతాయన్నారు.

Immigration Curbs Will Backfire Jaishankar to US Europe

వలస వచ్చే కార్మికులకూ, ఆయా దేశాల్లో వాస్తవ సంక్షోభాలకు ఎలాంటి సంబంధం లేదని జైశంకర్ తెలిపారు. పాశ్చాత్య దేశాలలో ఆందోళనలు దీర్ఘకాలిక విధాన నిర్ణయాల ఫలితమేనని అన్నారు. అమెరికాలో లేదా యూరప్‌లో ఆందోళనలు ఉంటే, అది గత రెండు దశాబ్దాలుగా వారు తమ వ్యాపారాలను తరలించడానికి స్పృహతో, ఉద్దేశపూర్వకంగా అనుమతించినందువల్లే అన్నారు. అది వారి ఎంపిక, వ్యూహం. వారు దానిని సరిదిద్దడానికి మార్గాలను కనుగొనాలని ఆయన సూచించారు.

Immigration Curbs Will Backfire Jaishankar to US Europe

నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి స్వేచ్ఛాయుత ప్రవాహం వల్ల కలిగే పరస్పర ప్రయోజనాలపై దృష్టి సారించాలని జైశంకర్ ఆయా దేసాలకు సూచించారు. సరిహద్దులకు అతీతంగా ప్రతిభను వాడుకోవడం వల్ల పరస్పర ప్రయోజనాలు నెరవేరతాయని ఆయా దేశాల్ని మనం ఒప్పించాల్సి రావడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ప్రతిభ ప్రవాహానికి అడ్డంకులు సృష్టిస్తే వారు నికర లూజర్లు అవుతారన్నారు. ఆధునిక ఉత్పాదన రంగంలోకి ఆర్థిక వ్యవస్థలు అడుగుపెడుతున్నందున ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి అవసరం పెరుగుతుందన్నారు. అయినా పాశ్చాత్య దేశాలు ఈ ఒత్తిళ్లు దాటే మార్గం కనుగొంటాయని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+