పాకిస్తాన్ జైలులో ఇమ్రాన్ ఖాన్ హత్య? నిజమేంటి?
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని జైలులో హత్య చేయబడ్డారంటూ పాకిస్తాన్ నుంచి వార్తలు వస్తున్నాయి. ఆ ఆరోపణలు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం సృష్టించాయి. అయితే అధికారులు ఈ వాదనలను ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారని బలూచిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వంటి పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆయన హత్య గురించి పోస్ట్ చేశాయి. అయినప్పటికీ వార్తలకు మద్దతుగా ఎటువంటి అధికారిక సమాచారం లేకపోవడం గమనార్హం.
బలూచిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేస్తూ.. "కస్టడీలో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను అసిమ్ మునీర్, అతని ISI పరిపాలన చంపేశారని అనేక వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఈ సమాచారం నిజమైతే అది ఉగ్రవాద పాకిస్తాన్‌కు సంపూర్ణ ముగింపును సూచిస్తుంది. ఈ నిజం ప్రపంచానికి తెలిసిన వెంటనే దాని చివరి చట్టబద్ధత కూడా కూలిపోవడం మొదలవుతుంది" అని పేర్కొంది.
Reports are now surfacing from inside the prisons of PUnjabi Pakistan that Imran Khan, who was being held in custody, has been killed by Asim Munir and his ISI administration according to several news outlets. If this information is confirmed to be true, it marks the absolute end… pic.twitter.com/SbbVB5uJll
— Ministry of Foreign Affairs Baluchistan (@BaluchistanMFA) November 26, 2025

మరోవైపు పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌ను అడియాలా జైలులో రహస్యంగా చంపేశారని అఫ్గాన్ మీడియా కూడా ప్రకటించింది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం, సైనికాధికారులు ఈ ఆరోపణలను ఖండించారు. పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారని చెబుతోంది. ఈ వార్తలు ప్రచారం కావడంతో అడియాలా జైలు వద్ద పీటీఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 'అఫ్ఘానిస్తాన్ టైమ్స్' మంగళవారం రాత్రి సంచలన ప్రకటన చేసింది. "పాకిస్తాన్‌లోని విశ్వసనీయ మూలాలు వెల్లడించిన సమాచారం ప్రకారం, పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌ను అడియాలా జైలులో రహస్యంగా చంపేశారు. అతని శవాన్ని జైలు నుంచి బయటకు తరలించారు" అని ఆ వార్తలో పేర్కొన్నారు. ఈ ఆరోపణలు మిగతా అఫ్గాన్ మీడియా ఔట్‌లెట్లలో కూడా ప్రచారం అయ్యాయి.
ఈ క్రమంలో పాకిస్తాన్ అధికారులు ఆ ఆరోపణలు తప్పుడు వార్తగా ఖండించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నాడని.. అతనికి ఎలాంటి హాని జరగలేదని.. ఈ పుకార్లు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడానికేనని పాకిస్తాన్ సమాచార మంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అడియాలా జైలు సూపరింటెండెంట్ కూడా స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం బాగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ పుకార్లను అడ్డుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ పుకార్ల వల్ల పీటీఐ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అడియాలా జైలువద్ద వేలాది మంది సమావేశమైన ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి సమాచారం కోరుతూ నిరసనలు తెలిపారు.
ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్.. ఆంక్షలు
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) అధిపతి అయిన ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుండి జైలులో ఉన్నారు. గత కొన్ని నెలలుగా ఇస్లామాబాద్ ప్రభుత్వం ఆయనను జైలులో కలిసేందుకు అనుమతి లేకుండా అప్రకటిత నిషేధం విధించింది. మరణ వార్తల నేపథ్యంలో మంగళవారం ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులు - నొరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ ఆయనను కలవడానికి ప్రయత్నించారు. అడియాలా జైలు వెలుపల గుమిగూడినప్పుడు పోలీసులు తమపై, అలాగే పార్టీ మద్దతుదారులపై దారుణంగా దాడి చేశారని వారు ఆరోపించారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిదిని కూడా ఇమ్రాన్ ఖాన్‌ను కలవడానికి అనుమతించలేదు. ఆర్మీ నియంత్రణలో ఉన్నారని ఖాన్ ఆరోపించిన జైలు అధికారులు.. అఫ్రిది ఏడుసార్లు ప్రయత్నించినా అనుమతి నిరాకరించారు.ఈ నివేదికలు ప్రస్తుతం ధ్రువీకరించబడనందున, పరిస్థితిపై మరింత అధికారిక స్పష్టత కోసం వేచి చూడాల్సి ఉంది.
-
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications