మా ప్రధానే పిరికోడు..మోడీ పేరెత్తలేడు..ఇంకేం యుద్దం ? పాక్ ఎంపీ షాకింగ్ ..!

పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ను భారీగా దెబ్బతిస్తోంది. పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర శిబిరాలతో పాటు ఆర్మీ ఆయుధ రక్షణ వ్యవస్థల్ని సైతం భారత సైన్యం ధ్వంసం చేసినా కిమ్మనలేని పరిస్ధితి వారిది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలతో పాటు రాజకీయ నేతల్లో కూడా పాకిస్తాన్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తమవుతోంది. తాజాగా పాకిస్తాన్ ఎంపీ ఒకరు పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆ దేశ రాజకీయ నాయకుల ఆగ్రహం అర్థమవుతోంది.

పాకిస్తాన్ లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పీటీఐ ఎంపీ షాహిద్ అహ్మద్ ఇవాళ పార్లమెంట్ లో మాట్లాడుతూ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనో పిరికి వాడని, పొరుగు దేశ ప్రధాని మోడీ పేరెత్తడానికి కూడా భయపడుతున్నాడని ఆరోపించారు. టిప్పుసుల్తాన్ మాటల్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సింహాల గుంపును నక్కలు నడిపిస్తే అవి యుద్ధంలో పోరాడలేక ఓడిపోతాయన్నారు. అలాగే పాకిస్తాన్ సైనికులు కూడా ఇలాంటి ప్రధానిని నడిపిస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు.

Imran khan party mp shocking remarks on pakistan PM says coward can t fight with india

ముఖ్యంగా భారత్ తమ దేశంలో దాడులు చేస్తుంటే ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇప్పటివరకూ ఓ ప్రకటన కూడా చేయలేదని ఎంపీ షాహిద్ అహ్మద్ విమర్శించారు. ఇలాంటి పరిస్ధితుల్లో సరిహద్దుల్లో పాక్ సైనికులకు ప్రభుత్వం ఇంకేం ఆదేశాలు ఇస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికే బారత్ తో సాగుతున్న పోరులో తమకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతుండటం, ప్రభుత్వం నుంచి కనీస ప్రతిస్పందన లేకపోవడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వమే తమకు తగులుతున్న దెబ్బల్ని అంగీకరిస్తుండటం వారికి మింగుడు పడటం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+