వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైద్య చరిత్రలో మరో అద్భుతం ఆవిష్కరణ: మనిషికి పంది గుండె

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: మనిషికి పంది గుండెను అమర్చిన ఉదంతం అమెరికాలో చోటు చేసుకుంది. చావుకు చేరువైన ఓ 57 సంవత్సరాల పేషెంట్‌కు దీన్ని అమర్చారు డాక్టర్లు. ఈ శస్త్రచికిత్స విజయవంతమైనట్లు ప్రకటించారు. మూడు రోజుల కిందటే ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఆ పేషెంట్‌ను అబ్జర్వేషన్‌లో ఉంచారు. 72 గంటల పాటు అబ్జర్వేషన్‌ తరువాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని, గుండె యధాతథంగా పని చేస్తోందని ధృవీకరించారు. ఆ శస్త్రచికిత్స విజయవంతమైనట్లు ప్రకటించారు.

చారిత్రాక ఘట్టంగా..

చారిత్రాక ఘట్టంగా..

జంతువుల అవయవాలను మనుషులకు అమర్చడం ద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చనే విషయంపై నిర్వహిస్తోన్న పరిశోధనల్లో దీన్నొక కీలక మలుపుగా భావిస్తున్నారు డాక్టర్లు. చారిత్రాత్మకమైన ఘట్టంగా అభివర్ణిస్తున్నారు. ఓ మనిషిని ప్రాణాలతో ఉంచడానికి అత్యవసరమైన హృదయాన్ని ఓ పంది గుండెతో మార్పిడి చేయడాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నారు. వైద్యరంగంలో ఇదొక విప్లవాత్మకమైన మార్పుగా చెబుతున్నారు.

57 సంవత్సరాల పేషెంట్‌కు..

57 సంవత్సరాల పేషెంట్‌కు..

పంది గుండెను జన్యుపరంగా కొద్దిగా మార్పులు చేయడం ద్వారా దాన్ని మనిషికి అమర్చవచ్చని నిరూపించారు. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్‌లో ఈ సర్జరీ జరిగింది. సుమారు నాలుగు గంటల పాటు డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. డేవిడ్ బెన్నెట్ అనే 57 సంవత్సరాల పేషెంట్‌కు పంది గుండెను అమర్చారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన శస్త్రచికిత్స కావడం ట్విస్ట్. ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్న డేవిడ్ బెన్నెట్‌‌పై ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.

శరీరంపై ప్రయోగాలకు సిద్ధపడే..

శరీరంపై ప్రయోగాలకు సిద్ధపడే..

గుండె మార్పడిని చేయించుకోకపోతే తాను ఖచ్చితంగా మరణిస్తానిని డాక్టర్లు ఇదివరకే నిర్దారించారని డేవిడ్ బెన్నెట్ తెలిపారు. గుండె మార్పిడి చేయించుకోవడానికే సిద్ధపడ్డానని పేర్కొన్నాడు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ డాక్టర్లు తన శరీరంపై ప్రయోగాలు చేయడానికి అంగీకరించానని, దీనికి సంబందించిన ప్రక్రియను మొత్తం పూర్తి చేసిన తరువాతే ఆపరేషన్‌కు సిద్ధం అయ్యానని డేవిడ్ బెన్నెట్ చెప్పారు. ఈ మేరకు ఓ స్టేట్‌మెంట్ విడుదల చేశారాయన.

షుగర్ సెల్స్ తొలగించడం ద్వారా..

షుగర్ సెల్స్ తొలగించడం ద్వారా..

మనిషి హృదయం కంటే పంది గుండె వేగంగా కొట్టుకుంటుందని, దీన్ని నియంత్రించడమే తమకు ప్రధాన సమస్యగా మారినట్లు ఈ ఆపరేషన్‌కు సారథ్యాన్ని వహించిన డాక్టర్ డేవిడ్ క్లాస్సెన్ తెలిపారు. ఆ వేగాన్ని నియంత్రించడానికి అందులో ఉన్న చక్కెర కణాలను తొలగించామని చెప్పారు. పంది గుండెలోని షుగర్ సెల్స్‌ను తొలగించడం ద్వారా హైపర్ ఫాస్ట్ ఆర్గాన్ వేగాన్ని అదుపులోకి తీసుకుని రాగలిగామని అన్నారు.

గుండె కొరత ఉండదిక..

గుండె కొరత ఉండదిక..

ఈ ఆపరేషన్ విజయవంతం ద్వారా గుండె కొరత ఉండబోదని యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ యానిమల్ టు హ్యూమన్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రామ్ సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ ముహమ్మద్ మొహియుద్దీన్ చెప్పారు. దీనికి సంబంధించిన మెడికల్ డేటా మొత్తాన్నీ క్షున్ణంగా అధ్యయనం చేశామని అన్నారు. దాన్ని భద్రపరిచామని పేర్కొన్నారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్‌లో దీన్నొక పాఠ్యాంశంగా చేర్చాలనే విషయాన్ని పరిశీలిస్తున్నామని, దీనికి చాలా సమయం పట్టొచ్చని వ్యాఖ్యానించారు.

English summary
In a medical first, doctors transplanted a pig heart into a patient in a last-ditch effort to save his life and a Maryland hospital said Monday that he’s doing well three days after the highly experimental surgery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X